నభా నటేష్ కి ఆఫర్లు లేకపోవడానికి కారణం అదేనా..!

కన్నడలో వజ్రకాయ, లీ, సాహెబ్ సినిమాలు చేసిన నభా నటేష్ తెలుగులో సుధీర్ బాబు నటించిన నన్ను దోచుకుందువటే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.మొదటి సినిమాతోనే తెలుగు దర్శక నిర్మాతల దృష్టిలో పడిన నభా నటేష్ ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంది.

 Why Nabha Dont Have Offers Here Is The Reasons  Nabha Natesh , Tollywood,maestro-TeluguStop.com

ఇక పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో అమ్మడి నటనకు అందరు ఫిదా అయ్యారు.ఆ సినిమాలో వరంగల్ అమ్మాయిగా నభా నటేష్ యాస, గ్లామర్ షో సినిమాకే హైలెట్ గా నిలిచాయి.

అప్పటి నుంచి అమ్మడు ఆడియెన్స్ కి హాట్ ఫేవరెట్ అయ్యింది.ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత రవితేజతో డిస్కో రాజా ఛాన్స్ అందుకుంది అమ్మడు.అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో కెరియర్ లో వెనకపడ్డది.ఆ తర్వాత సాయి ధరం తేజ్ తో సోలో బ్రతుకే సో బెటర్, బెల్లంకొండ శ్రీనివాస్ తో అల్లుడు అదుర్స్ సినిమాల్లో నటించింది నభా నటేష్ ఈ సినిమాలు కూడా పెద్దగా ఆమె కెరియర్ కు ఉపయోగపడలేదు.

చివరగా నితిన్ తో మ్యాస్ట్రో సినిమా చేసింది నభా నటేష్.చేసిన సినిమాలేవి ఆమె కెరియర్ కి ఉపయోగపడలేదని చెప్పాలి.

అయితే ఇప్పుడు నభా నటేష్ కి ఒక్క సినిమా ఆఫర్ కూడా చేతిలో లేదు.దీనికి పధాన కారణం అమ్మడు భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడమే అని అంటున్నారు.

ఈమధ్య ఒక సినిమా హిట్ పడగానే హీరోయిన్స్ అంతా కోటి రాగం పాడుతున్నారు.

Telugu Disco Raja, Ismart, Ismart Shankar, Nabha, Nabha Natesh, Nabhanatesh, Tol

ఈ క్రమంలో ఇస్మార్ట్ శంకర్ తర్వాత నభా నటేష్ కూడా 75 లక్షల నుంచి కోటి దాకా రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట.అయితే డిస్కో రాజా, అల్లుడు అదుర్స్ లకు ఆమె అడిగినంతా ఇచ్చారట.ఈమధ్య ఓ నిర్మాత నభా డేట్స్ కోసం వెళ్తే అమ్మడు ఇప్పుడు కూడా రెమ్యునరేషన్ కోటి అడుగుతుందని తెలుస్తుంది.

అసలే ఫాం లో లేదు.పైగా వరుస ఫ్లాపులు ఉన్నాయి.

అయినా సరే రెమ్యునరేషన్ విషయంలో ఏమాత్రం తగ్గేదిలేదని అంటుంది నభా నటేష్.మరి అమ్మడు అడిగినంత ఇచ్చి ఆమెని సినిమాల్లోకి తీసుకుంటారా ఇలా చూసి చూసి నభానే తన రెమ్యునరేషన్ తగ్గించుకుంటుందా అని వేచి చూస్తున్నారు.

నభా నటేష్ ఫ్యాన్స్ మాత్రం ఆమెని రెగ్యులర్ గా సినిమాల్లో చూడాలని ఆశిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube