కృష్ణ కూతురు మంజులను బాలకృష్ణ సినిమా నుండి తీసేయాలని ఆత్మాహుతి ఎవరు చేసుకోబోయారు

సాధారణంగా స్టార్ హీరోలను ప్రజలు బాగా ఆదరిస్తున్నారు.తమ సొంత కుటుంబ సభ్యుల లాగానే తమ ఫేవరేట్ హీరో లను పరిగణిస్తారు.

 Why Manjula Movie With Balakrishna Stopped By Krishna Fans, Balakrishana Movie, Mahesh Babu, Hero Krishna, Director Krishna Reddy, Soundarya-TeluguStop.com

అయితే ఆ స్టార్ హీరోల కుటుంబం నుంచి ఎవరైనా అబ్బాయి హీరోగా ఎంట్రీ ఇస్తే సంబరపడతారు.అదే తమ ఫేవరెట్ హీరో ల కుటుంబం నుంచి ఒక అమ్మాయి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలనుకుంటే మాత్రం తీవ్ర విముఖత చూపుతుంటారు.

ఎందుకంటే కుటుంబంలా భావించే తమ ఫేవరెట్ హీరో లా బిడ్డలు గానీ చెల్లెలు గాని హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి వేరొక హీరోలతో రొమాన్స్ చేయడాన్ని అభిమానులు తట్టుకోలేరు.చాలామంది సినిమా హీరోల కూతుర్లు హీరోయిన్లుగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాలని అనుకున్నారు కానీ వారి అభిమానులు మాత్రం అందుకు ఒప్పుకోలేదు.

 Why Manjula Movie With Balakrishna Stopped By Krishna Fans, Balakrishana Movie, Mahesh Babu, Hero Krishna, Director Krishna Reddy, Soundarya-కృష్ణ కూతురు మంజులను బాలకృష్ణ సినిమా నుండి తీసేయాలని ఆత్మాహుతి ఎవరు చేసుకోబోయారు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ విషయంలో అభిమానులకు ఎంతటి హీరో అయినా సరెండర్ కావాల్సిందే.

ఇటీవల కాలంలో మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక సినిమాలలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు.

హీరో డాక్టర్ రాజశేఖర్ కూతురు శివాత్మిక కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు.ఇప్పుడంటే ఫ్యాన్స్ నీ లైట్ గా తీసుకుంటున్నారు కానీ ఒకప్పుడు సినిమా అభిమానులు తమ ఫేవరేట్ హీరోల కూతుర్లు హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్నారని తెలియగానే బాగా ఖర్చు చేసేవారు.

సూపర్ స్టార్ కృష్ణ కూతురు మంజుల హీరోయిన్ గా అరంగేట్రం చేయాలని బాగా తపన పడ్డారు కానీ అందుకు ఫ్యాన్స్ మాత్రం ఒప్పుకోలేదు.

మంజుల తన తండ్రి కృష్ణకు తనకు హీరోయిన్ కావాలని ఉందని చెప్పారు.ఐతే మొదట్లో ఆమె కోరికకు తీవ్ర అభ్యంతరం తెలిపిన కృష్ణ ఆ తర్వాత ఒప్పుకున్నారు.అలాగే పద్దతిగా సినిమాలు తీసే ఎస్వీ కృష్ణారెడ్డిని పిలిచి మంచి కథానాయక గా తన కూతురిని ప్రేక్షకులకు పరిచయం చేయాలని చెప్పారు.

సూపర్ స్టార్ కృష్ణ కోరిక మేరకు దర్శకుడు కృష్ణారెడ్డి ఓకే చెప్పారు.అప్పటికే కృష్ణారెడ్డి బాలయ్య “టాప్ హీరో” సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం దక్కించుకున్నారు.దీంతో మంజులను బాలకృష్ణ సరసన నటింపజేయాలని అనుకున్నారు.1994 కాలంలో బాలకృష్ణ సరసన సూపర్ స్టార్ కృష్ణ కూతురు మంజుల నటించబోతున్నారని ప్రకటించారు.ఇది తెలుసుకున్న సూపర్ స్టార్ అభిమానులు ఒక్కసారిగా బయటికి వచ్చి నానా బీభత్సం సృష్టించారు.కృష్ణా , గుంటూరు, కాకినాడ ఇలా వివిధ ప్రాంతాల నుంచి వందల మంది అభిమానులు హైదరాబాద్ వెళ్లి పద్మాలయ స్టూడియో ముందు పెద్ద గొడవ చేసేసారు.

దీనితో సూపర్ స్టార్ కృష్ణ రంగంలోకి దిగి తన అభిమానులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు కానీ విఫలమయ్యారు.కృష్ణ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో తన వల్ల ఎవరి మనోభావాలు దెబ్బతినకూడదని మంజుల తన నిర్ణయం మార్చుకున్నారు.

ఆమె తన నిర్ణయాన్ని మార్చుకోగానే కృష్ణ మీడియా ముందుకు వచ్చి తన కుమార్తె హీరోయిన్ గా నటించడం లేదని ప్రకటించారు.దీంతో అభిమానులు శాంతించారు.

ఐతే కృష్ణారెడ్డి మంజుల స్థానంలో సౌందర్యను ఎంపిక చేసుకొని “టాప్ హీరో” మూవీ ని పూర్తి చేశారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube