Mahesh Babu Krishna : తల్లీతండ్రీ మరణించినా మహేష్ బాబు గుండు చేయించుకోకపోవడానికి అసలు కారణం అదేనా?

టాలీవుడ్ స్టార్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ ఇటీవల మరణించిన విషయం మనందరికీ తెలిసిందే.సూపర్ స్టార్ కృష్ణ మరణంతో ఒక్కసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీలో విషాదఛాయలు అనుకున్నాయి.

 Why Mahesh Babu Dont Remove His Hair After Parents Death , Mahesh Babu, Tollywoo-TeluguStop.com

ఇప్పటికి ఘట్టమనేని అభిమానులు అలాగే మహేష్ బాబు ఫ్యామిలీ కృష్ణ మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు.అయితే సూపర్ స్టార్ కృష్ణ మరణించడానికి కొద్ది రోజుల ముందే ఆయన భార్య ఇందిరా దేవి కూడా మరణించిన విషయం తెలిసిందే.

అలాగే ఈ ఏడాది ప్రారంభంలో మహేష్ బాబు అన్న రమేష్ బాబు కూడా మరణించిన విషయం తెలిసిందే.ఇలా ఒకే ఏడాదిలో ముగ్గురిని కోల్పోవడంతో మహేష్ బాబు ఆ బాధ నుంచి తేరుకోలేకపోతున్నాడు.

ఒకే ఏడాది వరుసగా ఇంట్లో మూడు విషాదాలు చోటు చేసుకున్నాయి.అయితే ఆ బాధలన్నీ దిగమింగుకొని గుండె ధైర్యం చేసుకొని మహేష్ బాబు అంతక్రియలకు కర్మ కర్మకాండలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను దగ్గరుండి పూర్తి చేశారు.

ఇందిరా దేవి,కృష్ణ లకు మహేష్ బాబు తలకొరివి పెట్టిన విషయం తెలిసిందే.సాధారణంగా తలకొరివి పెట్టిన తర్వాత తలనీలాలు సమర్పించడం అన్నది ఎప్పటినుంచో వస్తున్న విషయం తెలిసిందే.

కానీ మహేష్ బాబు మాత్రం తలనీలాలు ఇవ్వకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.తన తల్లి మరణించినప్పుడు అలాగే తన తండ్రి మరణించినప్పుడు మహేష్ బాబు తన తల వెంట్రుకలు తియ్యకపోవడం వెనుక కారణం ఏంటి అని జనాలు చర్చించుకుంటున్నారు.

Telugu Indira Devi, Mahesh Babu, Ramesh Babu, Krishna, Tollywood-Movie

అయితే మహేష్ బాబు తలనీలాలు సమర్పించకపోవడానికి తన తదుపరి సినిమాలే కారణం అని తెలుస్తోంది.ఎందుకంటే మహేష్ బాబు జుట్టు తీస్తే అది పూర్తిస్తాయిలో పెరగడానికి కనీసం మరొక ఆరు నెలల సమయం అయినా పడుతుంది.దీంతో సినిమాల షూటింగ్ లకు అంతరాయం ఏర్పడుతుందని మహేష్ బాబు తలనీలాలు సమర్పించలేదని వార్తలు వినిపిస్తున్నాయి.అంతేకాకుండా మహేష్ బాబు జుట్టు పూర్తి స్థాయిలో ఒరిజినల్ కాదు అన్న విషయం తెలిసిందే.

మహేష్ బాబు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న విషయం తెలిసిందే. సహజంగా కనిపించే క్యూ6 హెయిర్ ప్యాచ్ టెక్నాలజీతో ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్నారు మహేష్ బాబు.

అంతేకాకుండా మహేష్ బాబు తలనీలాలు సమర్పించడం వల్ల ఆయన లుక్కు విషయంలో కూడా విమర్శలు వస్తాయి అంటూ పలువు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube