కేటీఆర్ ఎందుకు ఉలిక్కిపడుతున్నాడు ? ఆ ఫామ్ హౌస్ లో ఏముంది ?

ఫామ్ హౌస్ రాజకీయాలు తెలంగాణలో కొత్త ఏమీ కాదు.టిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ మొన్నటి వరకు వార్తల్లో ఉండేది.

 Why Ktr Getting Tension Whats In The Farmhouse-TeluguStop.com

కేసీఆర్ తరచుగా అక్కడికి వెళుతుండటం, అక్కడే రెండు మూడు రోజులపాటు ఉండిపోవడం, అక్కడి నుంచే రాజకీయ సమీకరణాలు, నిర్ణయాలు, నాయకులతో కీలక విషయాలు చర్చించడం, ఇవన్నీ జరిగేవి.ఇక కెసిఆర్ రాజకీయ ప్రత్యర్థులు కూడా ఫామ్ హౌస్ ప్రస్తావన పదే పదే తెస్తూ కేసీఆర్ ను విమర్శిస్తూ ఉండేవారు.

ఇప్పుడు కేటీఆర్ ఫామ్ హౌస్ మీద కూడా ఎక్కడలేని రచ్చ మొదలైంది.అసలు ఇప్పటి వరకు కేటీఆర్ కు ఫామ్ హౌస్ ఉన్న సంగతి ఎవరికి తెలియదు.

Telugu Flydrone, Kcr Farm, Revanthreddy, Trs Ktr, Ktrwhats-Political

అకస్మాత్తుగా కేటీఆర్ ఫామ్ హౌస్ గురించి తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రస్తావించడం, నిబంధనలకు విరుద్ధంగా కేటీఆర్ ఫామ్ హౌస్ నిర్మించుకున్నారు అంటూ ఆరోపణలు చేయడం, రేవంత్ ఆరోపణలను టిఆర్ఎస్ కూడా తీవ్రంగా పరిగణించి రేవంత్ విషయంలో కఠినంగా వ్యవహరించడం, పార్టీ నాయకులతో ప్రెస్ మీట్ పెట్టించి రేవంత్ కు వ్యతిరేకంగా విమర్శలు చేయించడం జరిగాయి.కేటీఆర్ కు ఫామ్ హౌస్ ఉందని, తామంతా అక్కడికి చాలా సార్లు వెళ్ళాము అని టిఆర్ఎస్ నాయకుడు బాల్క సుమన్ ప్రకటించడం, లీజుకు తీసుకున్న డాక్యుమెంట్లు కూడా ఉన్నాయంటూ చెప్పడం జరిగాయి.

ఇక రేవంత్ రెడ్డి డ్రోన్ కెమెరాతో కేసీఆర్ ఫామ్ హౌస్ పరిసర ప్రాంతాలను చిత్రీకరించడంతో ఆయనపై కేసు పెట్టారు.ఇంత జరుగుతున్నా కేటీఆర్ మాత్రం ఎక్కడా దీని గురించి స్పందించలేదు.

తమ పార్టీ నాయకులతో దీనిపై విమర్శలు చేస్తున్నారు.కానీ డ్రోన్ కెమెరా తో చిత్రీకరించారనే ఒక చిన్న కారణం తో రేవంత్ రెడ్డి ని ఎయిర్ పోర్ట్ వరకు వెళ్లి మరీ హడావిడిగా అరెస్టు చేయడం రాజకీయ కక్ష సాధింపుకు టిఆర్ఎస్ ప్రభుత్వం పాల్పడుతోందని తెలంగాణ ప్రజల్లో భావన కలిగించారు.

ఒకవేళ అరెస్ట్ చేయాలనే ఉద్దేశం ఉన్నా రేవంత్ పై భూ ఆక్రమణ కేసులు ఉన్నాయి.వాటికి ఆధారాలు కూడా దాదాపుగా సేకరించారు.

Telugu Flydrone, Kcr Farm, Revanthreddy, Trs Ktr, Ktrwhats-Political

ఈ కేసులో అరెస్టు చేసి ఉంటే అవినీతి ఆరోపణల్లో భాగంగా ఆయనను అరెస్టు చేశారని తెలంగాణ ప్రజలకు ఒక సంకేతం వెళ్ళేది.కానీ డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన చిన్న విషయానికే రేవంత్ ను అరెస్ట్ చేయడంతో కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఏదో జరుగుతోంది, లేకపోతే ఇంత హడావుడిగా రేవంత్ ను అరెస్ట్ చేయడం ఏంటి అనే చర్చ ప్రజల్లో మొదలైంది.కేటీఆర్ ఇంతగా కంగారు పడుతున్నారు అంటే ఫామ్ హౌస్ విషయంలో ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇదంతా కేటీఆర్ స్వయంకృతాపరాధంగానే కనిపిస్తోంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube