కారు' రూటు ఎందుకు మారింది ? ఇందుకేనా ?

ఏపీ రాజకీయాల్లో కాళ్లు, వేళ్లు పెట్టేస్తానని కంగారు పెట్టించిన తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మనసు ఇప్పుడు ఎందుకు మారిందో ఎవరికీ అంతు చిక్కడంలేదు.బాబు కి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం ఖాయం అని కంగారు పెట్టించిన కేసీఆర్ ఇప్పుడు ఆ గిఫ్ట్ సంగతి పూర్తిగా పక్కనపెట్టేసి తెలంగాణాలో 16 పార్లమెంట్ స్థానాల్లో ఎలా గెలవాలి అనే విషయంపై దృష్టిపెట్టాడు.

 Why Kcr So Silent Over Chandrababu Naidu-TeluguStop.com

అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ రాజకీయ ప్రసంగాలకు, ప్రస్తుతం ఇస్తున్న స్పీచ్ లకు తేడా స్పష్టంగా కనిపిస్తోంది.అప్పట్లో మహాకూటమి అంటూ హడావుడి చేసి కాంగ్రెస్ పార్టీతో జత కట్టి తనను ఇబ్బంది పెట్టారు అనే కోపం కేసీఆర్ లో కనిపించేది.

అందుకే బాబు మీద, టీడీపీ మీద తీవ్ర విమర్శలు చేశారు.

మనం కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను ఆంధ్రా వారి చేతుల్లో పెడదామా అని తెలంగాణ విభజన సెంటిమెంట్‌ని బాగా వాడుకున్నారు.ఆ స్ట్రాటజీ అప్పట్లో వర్కవుట్ అయ్యింది కూడా.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కేసీఆర్ వర్సెస్ చంద్రబాబు అనేలా సాగాయి.

ఇప్పుడు ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి.కానీ అప్పట్లో కేసీఆర్ కి బాబు మీద ఉన్న కోపం, కసి ఇప్పుడు ఉన్నట్టు కనిపించడంలేదు.

కేసీఆర్‌తో జగన్ అంటకాగుతున్నాడనే ప్రచారాన్ని చంద్రబాబు విజయవంతంగా ప్రజలకు చెప్పుకోగలిగాడు.అప్పట్లో తనను తిట్టడం ద్వారా కేసీఆర్ తెలంగాణ ఓటర్లను ఆకట్టుకున్నాడని, ఇప్పుడు అదే స్థాయిలో కేసీఆర్‌ని తిట్టి ఏపీలో వైసీపీ ని ఇబ్బందిపెట్టి .మిగతా అన్ని అంశాలకంటే కేసీఆర్ మీద దాడి చేయడానికే చంద్రబాబు సమయం కేటాయిస్తున్నారు.

తెలంగాణాలో మాత్రం చంద్రబాబు మాటల్ని కేసీఆర్ పట్టించుకున్న దాఖలానే లేదు.తన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉనికే లేదు కనుక.చంద్రబాబులాభపడాలనే ఆలోచనతో బాబు ముందుకు వెళ్తున్నాడు.

ఏ విషయాన్ని ఎక్కడ ఎంతవరకు వాడాలో అంతవరకు మాత్రమే వాడాలన్న రాజకీయ ప్రాధమిక సూత్రాన్ని కేసీఆర్ బాగా పాటిస్తారు.ఓటుకు నోటు కేసు విషయంలో కూడా ఆయన ఇదే తరహా వ్యూహం అమలు చేసుకున్నారు.

కానీ జగన్, కేసీఆర్ దోస్తీపై బాబు కొత్తరకంగా విమర్శలు చేయడంతో అది ఎక్కడ జగన్ కి చేటు తెస్తుందో అన్న ఆలోచనతో కేసీఆర్ వెనక్కి తగ్గి మొత్తం దృష్టంతా తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలపైనే పెట్టినట్టు అర్ధం అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube