చివరి రోజుల్లో మహానటి సావిత్రిని తలుచుకుని కల్పనా రాయ్‌ ఎంతో కుమిలిపోయిందట.. ఎందుకో తెలుసా!  

Why Kalpana Roy Got Emotional Remembering Savitri In Her Last Days

తెలుగు చిత్ర పరిశ్రమలో అదృష్టం ఒక్కసారి మాత్రమే తలుపు తడుతుంది.అప్పుడే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

 Why Kalpana Roy Got Emotional Remembering Savitri In Her Last Days-TeluguStop.com

లేదంటే అవకాశాలు మళ్లీ రమ్మంటే రావు.అలా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని ఎంతో మంది బిగ్ స్టార్స్ అయ్యారు.

మంచి కమెడియన్స్‌గా ఎదిగారు.అలాంటి వారిలో నటి కల్పనారాయ్ కూడా ఒకరు.

 Why Kalpana Roy Got Emotional Remembering Savitri In Her Last Days-చివరి రోజుల్లో మహానటి సావిత్రిని తలుచుకుని కల్పనా రాయ్‌ ఎంతో కుమిలిపోయిందట.. ఎందుకో తెలుసా  -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తెలుగు సినీ పరిశ్రమలో దాదాపు 4 వందలకు పైగా సినిమాల్లో నటించారు.తన సుదీర్ఘ ప్రయాణంలో ఎంతో మంది గొప్పనటులతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.తనదైన టైమింగ్‌తో అందరినీ కడుపుబ్బా నవ్వించారు.చూడటానికి భారీ పర్సనాలిటీ అయినప్పటికీ ఎన్నో సినిమాల్లో మంచి అవకాశాలు దక్కించుకున్నారు.

మెగాస్టార్ చిరంజీవితో కలిసి హిట్లర్ సినిమాలో కూడా నటించే అవకాశం కల్పనా రాయ్‌కు దక్కిందంటే ఆమె నటనా కౌశల్యం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.అయితే, చిత్ర పరిశ్రమలో పనిచేసి చాలా మంచి లైఫ్ లీడ్ చేసిన కొందర నటీనటులు చివరి రోజుల్లో ఎంతో దీనస్థితిని అనుభవించారట.

కనీసం అంత్యక్రియలకు డబ్బులేక చివరకు మా అసోసియేషన్ ఆదుకుందని తెలిసింది.

Telugu Hitler, Kalpana Roy, Maa, Chiranjeevi, Tollywood-Movie

ఒకప్పుడు కల్పనా రాయ్ మంచి జీవితాన్నే గడిపింది.వరుస సినిమాలతో, చాలా భాషాల్లో నటించి డబ్బులు కూడా బానే పోగెసుకుంది.కానీ, మహానటి సావిత్రి వలే అద్భుతంగా సాగిన ఆమె జీవితం ఒక్కసారిగా పతాళానికి పడిపోయింది.

చివరకు ఒక అనాథలాగా అందరినీ విడిచి వెళ్లిపోయింది.చనిపోయే ముందు కొద్దిరోజులు మహానటి సావిత్రిని తలుచుకుని కల్పనారాయ్ బాగా కుమిలిపోయిందట.

తన జీవితం వలే నాది అయపోయిందని.పట్టించుకునే వారు కరువయ్యారని ఎంతో బాధపడిందట.

Telugu Hitler, Kalpana Roy, Maa, Chiranjeevi, Tollywood-Movie

చివరి రోజుల్లో అవకాశాలు రాకపోవడం. నా అనేవారు లేక ఎంతో దీనస్థితిని గడిపిన కల్పనా రాయ్.ఒకప్పుడు ఎన్నోదాన ధర్మాలు చేసినట్టు తెలుస్తోంది.చివరకు ఆమెను ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆమె మరణాంతరం మా అసోసియేషన్ అంత్యక్రియలకు రూ.10వేలు అందించారని తెలిసింది.ఇప్పటికీ చాలా మంది నటీనటులు ఈమె లాంటి జీవితం గడుపుతున్నారని తెలుస్తోంది.

#Kalpana Roy #MAA #Hitler #Chiranjeevi #Kalpana Roy

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube