టాలీవుడ్ లో విక్టరీ వెంకటేష్ కి( Venkatesh ) ఫ్యామిలీ ఆడియన్స్ లో లేడీస్ లో ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనమంతా చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నాం.ఇప్పటికీ కూడా ఆయన సినిమా విడుదల అయ్యిందంటే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి క్యూలు కట్టేస్తారు.
నేటి తరం స్టార్ హీరోలెవ్వరికీ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ లో ఈ రేంజ్ క్రేజ్ రాలేదు అనడం లో ఎలాంటి అతిసయోక్తి లేదు.ఇదంతా పక్కన పెడితే వెంకటేష్ తో సినిమా చెయ్యడానికి ఏ హీరోయిన్ అయిన అదృష్టం లాగ భావిస్తారు.
ఎందుకంటే ఆయన పక్కన హీరోయిన్ గా చేసిన వారు పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ స్టార్స్ గా మారారు.ఉదాహరణకి టబు, దివ్య భారతి, కత్రినా కైఫ్ ఇలా ఎంతో మంది ఉన్నారు.
వీళ్లంతా వెంకటేష్ తో సినిమాలు చేసి, పాపులారిటీ ని దక్కించుకొని బాలీవుడ్ వైపు వెళ్లినవాళ్ళే.

అయిత్రే మన టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కాజల్ అగర్వాల్( Kajal Aggarwal ) మాత్రం వెంకటేష్ తో సినిమా చెయ్యడానికి ఇష్టపడలేదట.వివరాల్లోకి వెళ్తే వెంకటేష్ మరియు నాగ చైతన్య కాంబినేషన్ లో ‘వెంకీ మామ’( Venky Mama Movie ) అనే చిత్రం తెరకెక్కిన సంగతి అందరికీ తెలిసిందే.ఈ సినిమా అప్పట్లో డివైడ్ టాక్ తెచుకున్నప్పటికీ కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యింది.
ఈ చిత్రం నాగ చైతన్య కి జోడిగా రాశీ ఖన్నా, అలాగే వెంకటేష్ కి జోడిగా పాయల్ రాజ్ పుత్ నటించింది.అయితే పాయల్ రాజ్ పుత్ కంటే ముందుగా ఆ పాత్ర కోసం కాజల్ అగర్వాల్ ని అడిగారట.
కానీ ఆమె ఈ పాత్ర చెయ్యడానికి ససేమీరా నో చెప్పింది అట.అది వెంకటేష్ తో నటించడం ఇష్టం లేక కాదు.నాగ చైతన్య కి( Naga Chaitanya ) అత్తగా నటించడం ఇష్టం లేక అన్నమాట.

గతం లో నాగ చైతన్య కాజల్ అగర్వాల్ తో ‘దడ’( Dhada Movie ) అనే చిత్రం చేసాడు.ఈ సినిమా పెద్ద ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా వీళ్లిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.మళ్ళీ నాగ చైతన్య తో నటిస్తే హీరోయిన్ గానే చేస్తాను కానీ, అక్కగా, వదిన గా, అత్తగా చేసే ప్రసక్తే లేదని తెగేసి చెప్పిందట.
ఈ విషయం అప్పట్లో సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.







