జగన్ తప్పు చేస్తున్నాడా ..? ఆ విషయం పై నోరెందుకు మెదపడంలేదు..?       2018-06-23   22:38:44  IST  Bhanu C

అందివచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్తేనే రాజకీయాల్లో పై చేయి సాధించగలం. కానీ అవేవి పట్టించుకోకుండా నా దారి నాదే మీ దారి మీదే అన్నట్టు వ్యవహరిస్తే ఆ తరువాత ఫలితం అనుభవించాల్సిందే. సరిగ్గా ఇదే చేస్తోంది ఏపీ ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్. కడపలో ఏర్పాటు చేయాల్సిన ఉక్కు ఫ్యాక్టరీ గురించి టీడీపీ పోరాటం చేస్తూ ఎక్కడలేని ప్రచారం పొందుతోంది. పనిలో పనిగా తమకు బీజేపీ మీద ఉన్న పీకల్లోతు కోపాన్ని కూడా తీర్చేసుకుంటోంది. అయితే జగన్ సొంత జిల్లాలో ఇంత తతంగం జరుగుతున్నా అది నా పని కాదు అన్నట్టు పాదయాత్ర లో మునిగిపోయాడు. పోనీ ఎక్కడైనా ప్రసంగం లో ఆ ప్రస్తావన తెస్తన్నాడా అంటే అదీ లేదు.

ఉక్కు ఫ్యాక్టరీ ఒక్క కడప జిల్లాకు మాత్రమే పరిమితమైన వ్యవహారం లాగా.. ఆ జిల్లాలో కొన్ని ర్యాలీలు చేసింది టీడీపీ . ఎంపీ సీఎం రమేష్.. ప్రస్తుతం ఆమరణ నిరాహార దీక్షలో ఉన్నారు. మరి వైసీపీ ఏం చేస్తోంది. సైలెంట్ గా ఉంది. జగన్ ఈ విషయాన్ని సీరియస్’గా పట్టించుకోలేదనే విమర్శలు బలంగా వస్తున్నాయి. ఈ విషయంలో జగన్ ను తెలుగుదేశం విమర్శిస్తున్నా అయన మాత్రం పట్టించుకోవడంలేదు.వాస్తవంలో కూడా వైకాపా పెద్దగా చేస్తున్న పోరాటం లేదు.

కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్రం నో చెప్పడం అనేది కేవలం ఒక ట్వీట్ తో విస్మరించదగిన సమస్యేనా? అంతకంటె తీవ్రమైనది కాదా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పాదయాత్రలో ఉన్న జగన్ దాదాపుగా ప్రతిచోటా ప్రత్యేక హోదా గురించి ప్రస్తావిస్తున్నట్లుగా.. కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి ప్రస్తావించలేకపోవచ్చు అంత మాత్రాన…. ఆయన పార్టీ శ్రేణులు నాయకులు ఏం చేస్తున్నట్టు? కనీసం వారైనా కడప ఉక్కు ఫ్యాక్టరీని సాధించడం లక్ష్యంగా తమ పోరాటపథం ఏమిటో నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. బీజేపీ- వైసీపీ మధ్య అంతర్గత పొత్తు ఉండబట్టే ఈ వ్యవహారంపై ప్రశ్నించేందుకు జగన్ సాహసించడంలేదని .. టీడీపీ విమర్శలు గుప్పిస్తున్న జగన్ లో మాత్రం చలనం రావడం లేదు.