తండ్రిని తిట్టినా ఇంత మౌన‌మా జ‌గ‌న్‌.. ఎందుకిలా ?

సాధార‌ణంగా ఏ వ్య‌క్తికైనా త‌న ఇంట్లో వాళ్ల‌ను బ‌య‌టి వారు ఎవ‌రైనా తిడితే కోపం వ‌స్తుంది.పోనీ రాజ‌కీ యాల్లో ఉన్నా కోపం రాకుండా అయితే ఉండ‌దు.

 Why Jagan Becoming Silent When Someone Abused His Father Also,ap,political News,-TeluguStop.com

రాజ‌కీయాల్లో ఉన్నారు క‌నుక వ్య‌క్తిగ‌త దూష‌ణలు వ‌ద్ద‌ని సూచించే అవ‌కాశం ఉంటుంది.అయితే.

బ‌య‌టివారైతే ప‌రిస్థితి వేరేగా ఉంటుంది.కానీ జ‌గ‌న్ విషయంలో మాత్రం ఎటూ ఏమీ చేయ‌లేక‌పోతున్నారు.

త‌న సొంత తండ్రి, ఈ రాష్ట్రానికి ఉమ్మ‌డి మాజీ సీఎం, దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డిపై కొంద‌రు నాయ‌కులు తాజాగా విరుచుకుప‌డ్డారు.

గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లో అన్ని వ‌ర్గాల వారినీ ఆక‌ర్షించేందుకు పార్టీలు హ‌ద్దులు మీరి మ‌రీ ప్ర‌చారం చేసిన విష‌యం తెలిసిందే.

ఈ క్ర‌మంలోనే కొంద‌రు టీఆర్ఎస్ నేత‌లు, మ‌రికొంద‌రు బీజేపీనేత‌లు ఒక‌రిపై ఒక‌రు వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లు చేసుకున్నారు.ప్ర‌భుత్వం కూలిపోతుంద‌ని అన్నారు.స‌రే! ఎన్నిక‌ల్లో ఇలాంటివి కామ‌న్ అనుకోవ‌డం స‌హ‌జం.అయితే.

అస‌లు ఎన్నిక‌ల‌లో పాల్గొన‌ని పార్టీ వైసీపీ.ఒక్క చోటంటే.ఒక్క వార్డులోనూ వైసీపీ జెండా లేదు.పోనీ లోపాయికారీగా ఎవ‌రికైనా మ‌ద్ద‌తు ఇస్తోందా ? అంటే అది కూడాలేదు.

Telugu Andhra Pradesh, Ap, Ghmc, Telangana, Ysrcp-Telugu Political News

అయిన‌ప్ప‌టికీ ఓట్ల వేట‌లో భాగంగా. టీఆర్ఎస్‌, బీజేపీ నాయ‌కులు వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కేంద్రంగా విమ‌ర్శ‌లు సంధించారు.పావురాల గుట్టలో మాయమైపోయిన పావురం అని ఒకాయ‌న‌,  ‘కేసీఆర్‌ పోతాడన్నోళ్ళే పోయారు.’ అని ఇంకొకాయన వైఎస్ పై న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారు.ఇక‌, ‘తెలంగాణలో చిచ్చు రేపాలని చూశాడు.తెలంగాణ రాష్ట్ర సమితిని నాశనం చేద్దామనుకుని, నాశనమైపోయాడు.

’ అని మరో నాయ‌కుడు విమ‌ర్శ‌లు చేశాడు.ఈ విమ‌ర్శ‌లు వింటే ఎవ‌రికైనా కోపం వ‌స్తుంది.

అస‌లు ఎన్నిక‌ల్లో పోటీ లేని పార్టీ సంబంధం లేని విష‌యాన్నిఎందుకు రాజ‌కీయం చేస్తున్నార‌ని అడ‌గాల‌ని కూడా అనిపిస్తుంది.కానీ, ఏపీ సీఎంగా ఉన్న జ‌గ‌న్ మాత్రం వీటిపై నోరు విప్ప‌లేదు.

పోనీ.ఏపీలోని వైసీపీకి ఉన్న క‌ర‌డు గ‌ట్టిన నాయ‌కులు అయినా స్పందించారా ?  అంటే అది కూడాలేదు.మొత్తానికి సీఎం జ‌గ‌న్‌కు త‌న తండ్రిని తిట్టినా స‌ద‌రు పార్టీల‌పై విమ‌ర్శించే తీరిక లేదా ?  ధైర్యం లేదా ? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతుండ‌డం గ‌మ‌నార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube