టీవి చూస్తూ తినే అలవాటు ఉందా ? అయితే ఇది చదవండి

టీవిలో క్రికెట్ మ్యాచ్ వస్తూ ఉంటుంది, లేదా ఫేవరేట్ కార్టున్ వస్తూ ఉంటుంది.తిండి తినరా బాబు అని తల్లి మాటిమాటికి గుర్తు చేస్తే తప్ప ప్లేట్ ముట్టరు పిల్లలు.

 Why It Is Not Good To Watch Tv While Eating ?-TeluguStop.com

అదికూడా టివి చూస్తూనే తింటారు.చూసే ప్రోగ్రామ్స్ మారినా, తల్లి, తండ్రి, ఇద్దరూ టివి చూస్తూనే తింటారు చాలా ఇళ్ళలో.

మరి ఇలా టీవి చూస్తూ భోజనం చేయడం మంచి అలవాటేనా ? ముఖ్యంగా పిల్లలు ఇలా తినొచ్చా ?

అమెరికాలోని మినసోట యునివర్సిటి పరిశోధకులు మాత్రం ఈ అలవాటు మంచిది కాదు అని చెబుతున్నారు.వీరు దాదాపు 120 కుటుంబాలపై పరిశోధన చేసారు.

ఇందులో మనం ఊహించే నిజాలే బయటపడ్డాయి.ఇందులో టీవి చూస్తూ తినే కుటుంబాల మెటబాలిజం బాగా దెబ్బతింది.

ఎంత తింటున్నామో, ఏం తింటున్నామో కూడా సరిగా అవగానకు లేకుండా తిన్నవాళ్ళు కూడా ఉన్నారు.

సరైనా శాస్త్రీయ కారణం చెప్పలేదు కాని, టీవి చూస్తున్నప్పుడు మనకు భోజనం చేయాలన్న ఆలోచన తక్కువ ఉండి, ఏదైనా చిరుతిండి తినాలనే ఆలోచన ఎక్కువ ఉంటుందట.

అందుకేనేమో, క్రికెట్ మ్యాచ్ చుస్తున్నమంటే మనకు వెంట చిప్స్ ప్యాకిట్ ఉంటుంది.తినేటప్పుడు మెదడుని ప్రశాతంగా ఉంచాలి.

ఆహారంపై తప్ప, మరోదాని మీద ధ్యాస ఉండకూడదు.అప్పుడే మనం తిండిని ఎక్కడ ఆపాలో సరిగ్గా చెబుతుంది మెదడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube