తమన్నా మాటలు వింటే షాక్ అవుతారు!   Why Is Tamanna Talking Like This?     2018-03-05   01:17:02  IST  Raghu V

సినీ పరిశ్రమ అంటే చాల మందికి లోకువని, ఏదో, ఆడుతూ పాడుతో సాగిపోయే వృత్తి అని చాలామంది అనుకొంటారు. కాని అనుకున్నంత సులువైన ప్రోఫెషన్ ఏమీ కాదంటోంది హీరోయిన్ తమన్నా. నటీనటులుగా తాము పడే కస్టాలు ప్రజలకి, అభిమానులకి తెలియవంటుంది ఆమె. సినీ ప్రపంచం ఆడంబరంగా ఉంటుంది, కాని ఆనందం తక్కువ అని ఆమె వాపోయింది. ఈ పరిశ్రమలో తాము కోరుకున్నది చేసే స్వాతంత్రం ఉండదని ఆమె అభిప్రాయపడింది. పరిపూర్ణమైన సంతోషాన్ని నటీనటులు చూడలేరని ఆమె అన్నారు. పగలనకా, రాత్రనకా ఎక్కడ ఎప్పుడు షూటింగ్ అంటే , అక్కడకి వెళ్ళాల్సి ఉంటుందని ఆమె చెప్పుకొచ్చింది.

మనసులో ఎలాంటి కస్టాలు ఉన్నా, ఆరోగ్యం సహకరించక పోయినా, బయటకు నవ్వుతూ నటించాల్సి ఉంటుందని, సొంత పనులకు సమయం అరుదంటూ, కనీసం కుటుంబ సభ్యలతో గడిపే టైం కూడా తక్కువే అని ఆమె వాపోయింది. ఎప్పుడు ఫిట్నెస్ మైంటైన్ చేస్తూ,నచ్చిన ఆహారాన్ని సైతం మానేయాలని, ఎన్నో త్యాగాలు చేస్తేనే ఫిలిం ఇండస్ట్రీ లో నిలదొక్కు కోగలం అంటూ చెప్పింది. స్వేచ్చగా తిరిగే అవకాసం కూడా ఉండదని, మామూలు అమ్మాయిలని చూస్తే, ఈర్షగా ఉంటుందని ఆమె చెప్పారు.

అసలు సంతోషమే లేదనడం లేదు, కాని ఎన్నో త్యాగాలు చేస్తున్నామన్న విషయం జనాలకి అర్ధమైతే చాలంటూ ఆమె కోరారు. త్యాగాలు అన్ని ప్రోఫెషన్స్లో ఉన్నా, పేరు- ప్రఖ్యాతలు, డబ్బు ,పాపులారిటీ కేవలం సినీ రంగంలోనే ఎక్కువ ఉంటాయన్న సంగతి తమన్నకి తెలుసా? అయినా కష్టంగా ఉంటె, ఈ పరిశ్రమలో ఎందుకు ఉండటం అని ప్రశ్నిస్తున్నారు కొన్ని వర్గాలు.