సమంతకే ఎందుకిలా జరుగుతుంది.. మరోసారి నాస్టీ ట్రోల్స్ ను ఎదుర్కొంటున్న సామ్?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం కాలంలో ఎక్కువగా నెటిజన్ల ట్రోలింగ్ కి గురవుతున్నారు.నాగచైతన్యతో ఎప్పుడైతే ఈమె విడాకులు తీసుకున్నారో అప్పటినుంచి ఈమె పట్ల నెటిజన్లు పెద్ద ఎత్తున నెగిటివ్ కామెంట్లతో రెచ్చిపోతూ సమంతను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

 Why Is Samantha Happening Sam Facing Nasty Trolls Once Again Samantha, Tollywood-TeluguStop.com

ముఖ్యంగా విడాకులు తీసుకోవడానికి సమంత వ్యవహారశైలి కారణమంటూ చాలామంది సమంత పై నెగిటివ్ కామెంట్లు చేశారు.ఈ విధంగా తన గురించి ఇలాంటి కామెంట్స్ చేస్తున్నప్పటికీ ఈమె పరోక్షంగా వాటిపై స్పందిస్తూ తనదైన శైలిలో సమాధానం చెప్పింది.

ఇకపోతే నాగచైతన్య డేటింగ్ రూమర్స్ పై కూడా చైతన్య అభిమానులు సమంతను దారుణంగా ట్రోల్ చేశారు.ఈ విధంగా సమంత గురించి నెగిటివ్ కామెంట్ చేయడంతో సమంత కూడా ఈ విషయంపై ఘాటుగా స్పందించారు.

ఇక ఈ వివాదం ముగిసింది అనుకునేలోపు మరోసారి నెటిజన్లు సమంతను నాస్టీ అంటూ ట్రోల్ చేస్తున్నారు.గత కొద్ది రోజుల క్రితం సమంత సేవ్ సాయిల్ అనే కార్యక్రమంలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే.

Telugu Sadguru, Samantha, Shakunthalam, Tollywood, Yashoda-Movie

ఈ కార్యక్రమంలో భాగంగా సమంత సద్గురును ఇంటర్వ్యూ చేశారు.అయితే ఈ ఇంటర్వ్యూలో భాగంగా సద్గురు సమంత ఉద్దేశిస్తూ మీరు కొన్నిసార్లు చూడటానికి ఎంతో అందంగా ఉంటారు, మరికొన్నిసార్లు చాలా అసహ్యంగా ఉంటారనే ఉద్దేశంతో సమంతను బ్యూటిఫుల్ అండ్ నాస్టీ అంటూ సంబోధించారు.ఇక ఈ చిన్న వీడియో క్లిప్ వైరల్ కావడంతో చాలా మంది సమంత యాంటీ ఫ్యాన్స్ సద్గురు చెప్పిన బ్యూటిఫుల్ అనే మాటను కట్ చేసి కేవలం నాస్టీ అనే పదం పై తనని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.అయితే ఈ మధ్య కాలంలో సమంత గ్లామర్ షో చేయడంతో నెటిజన్లు ఇలా తనని నాస్టీ అంటూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

మరి ఈ కామెంట్లపై సమంత ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube