అప్పుడు చేసిన చిన్న సాయమే....ఇప్పుడు రాయలసీమ ప్రజలకు శాపంగా మారిందా..?   Why Is Rayalaseema In Andhra Pradesh So Backward     2018-10-21   09:21:05  IST  Sainath G

రాయలసీమ ప్రాంతములోని ప్రజలు, ఎవరైనా ఏ చిన్న సహాయం చేసిన, వారి సమస్య తన సమస్య గా భావించే గుణం వారిది, అలాంటి గుణమే వారికీ, వారి కుటుంబాలకు మరియు ఈ ప్రాంత భవిషత్ తరాలవారికి శాపంగా మారుతుందని తెలియని అమాయకత్వం వారిది.

కాబట్టే విజయనగర సామ్రాజ్యా వ్యవస్థాపకులు రాజధాని ని, ఈ ప్రాంతంలోని బళ్లారి జిల్లాలోని హంపీ లో ఏర్పాటు చేసుకుని సుమారు 200 సంవత్సరాలు, తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ, ఒక బలమైన రాజ్యంగా అవతరించారు. కానీ విజయనగర సామ్రాజ్య పాలకులు తమ బంధుత్వాలను మాత్రం కోస్తాఆంధ్ర వారితో కొనసాగించడమే , వారి పతనానికి దారితీసింది.

Why Is Rayalaseema In Andhra Pradesh So Backward-

వారి కుట్రలు, కుతంత్రాలూ ఆ సంస్కృతని కొన్ని కుటుంబాల వారు, వారి వ్యక్తిగత స్వార్థం కొసం వాడుకొని దానికి ఫ్యాక్షన్ పేరుతో వారిని, వారి తప్పులను ప్రశ్నించే వారిని ఫ్యాక్షనిస్టులరూపంలో చంపి ఈ ప్రాంతానికి ,శాపంగా మారి వారికి సహాయంగా వున్న ప్రజలను వారి కుటుంబాలను నాశనం చేశారు.ప్రస్తుతము ఫ్యాక్షనిస్టులు, వారి కుటుంబసభ్యులు రాజకీ నాయకుల రూపం లో వున్నారు. వారి ద్వారా నాశనమైన కుటుంబాలు మాత్రం వలసల రూపం లో గ్రామాలు వదిలి పట్టణాలకు పోయి చిన్న,చిన్న పనులు చేసుకుంటు జీవిస్తున్న సమయములో రాష్ట్ర విభజన ద్వార ఈ ప్రాంతము అభివృద్ధి చెందుతుంది అనుకుంటే ఇక్కడవున్నా రాజకీయ నాయకులు మాత్రం దానికీ భిన్నంగా వ్యవహరించి ఈ ప్రాంతానికి శ్రీభాగ్ ఓడంబడిక ప్రకారం రావలసిన వాటాను ప్రశ్నించే స్థాయిని కుడా కోల్పోయి, జీవాస్తవాలుగా మిగిలే ప్రయత్నం ద్వార వారి కుట్రబుద్ధిని చాటుకునే ప్రయత్నము జరుగుతున్నది.

Why Is Rayalaseema In Andhra Pradesh So Backward-

కావున నాటి పాలకుల స్ఫూర్తి తో ప్రత్యేక రాష్ట్రా ఏర్పాటు కు పూనుకునే సమయం ఆసన్నమైనది . నాటి రాయసీమ ప్రజాప్రతినిదుల సీమ రాష్ట్రా ఏర్పాటు మహా సభ 1928 కొనసాగింపుగా ప్రతి పౌరుడు కంకణబద్దుడై పిడికిలి భిగించి రాయీలతో కూడిన రాష్ట్ర ఏర్పాటుకు ముందడుగు వేయాలిని, లేని యడల నిన్న హైదరాబాద్ నగరం కోసం నేడు అమరావతి నగరనిర్మాణానికి రాయలసీమ ప్రజల శ్రమను,వారి పన్నుల ద్వార ధనాన్ని కొల్లగొట్టుతున్నారు తప్ప ఈ ప్రాంత ప్రజలకు ప్రత్యేక ఏర్పాటు ద్వారా 4 1%2 సంవత్సరాలైన విద్య , ఉద్యోగ ఉపాధి , పరిశ్రమలు ఏర్పాటు చేయకుండగా రాష్ట్రానికి రావాల్సిన రాజధానిని, హై కోర్టు ను, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులు ను నిధులను , విద్యా, ఉద్యోగ, ఉపాధి పరిశ్రమలను, అన్నింటిని తరలించి రాయల సీమను మరోమారు అన్యాయానికి గురి చేస్తున్నారు.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.