సంక్రాంతి పండుగకు.. గాలిపటాలకు మధ్య సంబంధం ఏమిటి.. ఈ ఆచారం ఎలా పుట్టిందో తెలుసా?

సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలు ఎన్నో సంప్రదాయాలు ఉట్టి పడతాయి.ఈ పండుగ కోసం పట్టణాలలో ఉన్న వారందరూ కూడా పల్లెలకు చేరుకుంటారు.

 Why Is Kite Flying A Vital Tradition On Every Sankranti Sankranthi, Kites, Tradi-TeluguStop.com

ఇలా ఈ పండుగను మూడు రోజుల పాటు ఎంతో ఘనంగా జరుపుకుంటారు.రంగు రంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, పిండి వంటలు, భోగి మంటలు, కోడి పందేలు, హరి దాసు గీతాలు, గంగి రెద్దుల కోలా హలం వంటి ఎన్నో సాంప్రదాయ కళలు ఈ పండుగ ద్వారా ఉట్టి పడతాయని చెప్పవచ్చు.

ఇక సంక్రాంతి పండుగ వస్తుందంటే దాదాపు నెలరోజుల ముందు నుంచి ఆకాశంలో గాలిపటాలు ప్రతి ఒక్కరిని కనువిందు చేస్తాయి.కేవలం సంక్రాంతి పండుగకు మాత్రమే గాలిపటాలు ఎందుకు ఎగుర వేయాలి? సంక్రాంతి పండుగకు గాలి పటాలకు మధ్య సంబంధం ఏమిటి? ఈ ఆచారం ఎలా పుట్టింది అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

సాధారణంగా మకర సంక్రాంతి పండుగ చలి కాలంలో వస్తుంది.సంక్రాంతి పండుగ రోజు సూర్య భగవానుడు దక్షిణాయన కాలం నుంచి ఉత్తరాయణ కాలంలోకి ప్రవేశిస్తాడు.కనుక ఈ పండుగ సూర్యభగవానుడికి అంకితం చేయబడింది.ఈ పండుగతో చలికాలం పూర్తి అయి వసంత కాలానికి ఆహ్వానం పలకడం కోసం ఆకాశంలో గాలిపటాలను ఎగురవేస్తారు.

అయితే మకర సంక్రాంతి రోజు గాలిపటాలు ఎగరవేయడం వెనక ఉన్న ఆంతర్యం ఏమిటి అనే విషయానికి వస్తే…ఈరోజుతో శీతాకాలం పూర్తి కావటం వల్ల ఉదయం నుంచి గాలిపటాలు ఎగరేస్తూ సూర్యరశ్మి పడేలా ఉండటం వల్ల ఎన్నో రకాల చర్మ వ్యాధులు తొలగిపోతాయని భావిస్తారు.

ఆధ్యాత్మికపరంగా అయితే 6 నెలల తర్వాత సకల దేవతలు నిద్ర నుంచి మేల్కొంటారని అందుకు సూచనగా ఆకాశంలోకి గాలిపటాలు ఎగురవేస్తూ దేవతలకు కృతజ్ఞతలు తెలిపే మార్గం అని కూడా భావిస్తారు.అందుకోసమే సంక్రాంతి పండుగ అంటేనే ఆకాశంలో రంగు రంగుల పతంగులు అందరినీ కనువిందు చేస్తుంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube