పూజలో అగరవత్తులు వెలిగించడం వెనుక కారణం ఏమిటో తెలుసా  

Why Is It Necessary To Burn Incense Stick While Praying?-

మన హిందూ సంప్రదాయం ప్రకారం పూజలు,వ్రతాలు చేసుకొనే సమయంలో అగరవత్తులనవెలిగించటం సర్వ సాధారణమే. ఇలా వెలిగించటం వెనక శాస్త్రీయమైన కారణాలఉన్నాయి. పురాతన భారతీయ సంప్రదాయంలో అగరవత్తులను వెలగించడం వల్ల గది అంతసువాసనతో నిండి ఉండేది...

పూజలో అగరవత్తులు వెలిగించడం వెనుక కారణం ఏమిటో తెలుసా-

అంతేకాకుండా ఆ రోజుల్లో ఉపయోగించే అగరబత్తిలలఔషధ గుణాలు ఉండేవి. ముఖ్యంగా వాటిలో గుగ్గిలం, సాంబ్రాణి వంటి వాటినఎక్కువగా ఉపయోగించేవారు. ఈ రోజుల్లో కూడా వీటిని ఎక్కువగా వాడుతున్నారు.

బోస్విలియా చెట్టు లభించే జిగురు నుంచి సాంబ్రాణిని తయారుచేస్తారుసాంబ్రాణి నుంచి వెలువడే సువాసన మెదడులోని టీర్పీవీ3 అనే ప్రొటీన్‌పప్రభావం చూపుతుంది. చర్మం కింద మృదువైన స్పర్శకు అవసరమైన స్రావాలను ప్రొటీన్ విడుదల చేసి ఒత్తిడిని అదుపులో ఉంచుతుంది. ఇక గుగ్గిలవిషయానికి వస్తే అథర్వణ వేదంలోనూ కూడా దీని గురించి వివరించారుగుగ్గిలం చెట్ల నుంచి మండు వేసవిలో లభించే జిగురు ద్వారా గుగ్గిలంనతయారుచేస్తారు. ఇది క్రిమిసంహారిగానే కాదు, రక్తస్రావాలను నివారించలక్షణాలను కలిగి ఉంటుంది.

సాంబ్రాణి,గుగ్గిలంతో తయారుచేసిన అగరబత్తులను వెలిగించినప్పుడు గాలిలకాలుష్యాన్ని నివారిస్తుంది. అలాగే అగరవత్తుల సువాసన కారణంగా మనస్సప్రశాంతంగా ఉండి ఏకాగ్రత చాలా బాగుంటుంది. అందువల్ల అగరవత్తులను పూజలవెలిగిస్తారు.

అగరవత్తులు వెలిగించినప్పుడు వెలువడే సువాసనతో చుట్టూ ఉన్పరిసరాల్లో పాజిటివ్ వేవ్స్ వ్యాప్తి చెందుతుంది. ఏదైనా నెగిటివ్ వేవ్సఉంటే వాటిని తటస్థంగా చేస్తుంది.