కౌశిక్‌రెడ్డి విష‌యంలోనే ఎందుకిలా జ‌రుగుతోంది.. కేసీఆర్ టార్గెట్ మిస్స‌వుతోందా..?

రాజ‌కీయ నాయ‌కులు త‌మ సొంత ప్ర‌యోజ‌నాల కోసం పార్టీలు మార‌డం స‌హ‌జం.కానీ ఆ పార్టీలో చేరిన త‌రువాత ఆ నాయ‌కుడికి త‌ను అనుకున్న ఫ‌లితం ద‌క్క‌క‌పోతే ఆ నేత ప‌రిస్థితి ఏమిటీ? అన‌వ‌స‌రంగా పార్టీలోకి వ‌చ్చామా? ఇక భ‌విష్య‌త్ ఎలా? అని ఆ నాయ‌కుడి మ‌దిలో ఎన్నో ప్ర‌శ్న‌లు.ఇప్పుడు ఇటివ‌ల టీఆర్ ఎస్‌లో చేరిన పాడి కౌశిక్‌రెడ్డి ప‌రిస్థితి కూడా ఇలా ఉంద‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.టీఆర్ ఎస్‌లో చేరిన కొద్ది రోజుల‌కే సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇస్తూ .రాష్ట్ర ప్రభుత్వం గ‌వ‌ర్న‌ర్‌కు ప్ర‌తిపాద‌న‌లు పంపింది.ఈ ప్రతిపాదనలపై తెలంగాణ గవర్నర్ తమిళిసై ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు.

 Why Is It Happening In The Case Of Kaushik Reddy Is Kcr Target Being Missed, Kau-TeluguStop.com

ఆమె గ‌వ‌ర్న‌ర్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించి రెండు సంవ‌త్స‌రాలు గ‌డిచిన సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వ‌డంపై స్పందించారు.

కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జిగా ఉన్న పాడి కౌశిక్‌రెడ్డి గ‌త ఎన్నిక‌ల్లో పోటి చేసి ఈట‌ల రాజేంద‌ర్ చేతిలో ఓట‌మి పాల‌య్యారు.

త‌రువాత కూడా కాంగ్రెస్‌లోనే కొన‌సాగారు.ఈట‌ల రాజేంద‌ర్‌పై భూ క‌బ్జా ఆరోప‌ణ‌లు రావ‌డంతో మంత్రి వ‌ర్గం నుంచి బ‌ర్త‌ర‌ఫ్ కావ‌డంతో హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక వ అనివార్య‌మైంది.

ఈ సారి కూడా కాంగ్రెస్ నుంచి పాడి కౌశిక్ రెడ్డి బ‌రిలో ఉంటార‌నే చ‌ర్చ జోరందుకుంది.కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆయ‌న‌కే టిక్కెట్ ఇవ్వాల‌ని యోచిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.

ఈ సారి మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌ను ఓడించాల‌నే కేసీఆర్ వ్యూహం ప్ర‌కారం చివ‌రి వ‌ర‌కూ కాంగ్రెస్‌లో ఉంటూ ఎన్నికకు ముందు అధికార పార్టీ నుంచి కౌశిక్‌రెడ్డి పోటీ చేసేలా ప్లాన్ చేశార‌ని విమ‌ర్శ‌లు వినిపించాయి.కానీ కౌశిక్ ముందే తన కార్యకర్తలతో టీఆర్ ఎస్ నుంచి టికెట్ వ‌స్తుంద‌ని ఫోన్‌లో లీక్ రావ‌డంతో దూమ‌రం రేగింది.

Telugu Etela Rajender, Kaushik Reddy, Mlc Seat, Telanganan, Ts-Telugu Political

ఈ ప‌రిణామంతో కాంగ్రెస్ నుంచి పాడి కౌశిక్‌రెడ్డిని బ‌హిష్క‌రించారు.రాజీనామా చేసి కౌశిక్‌రెడ్డి టీఆర్ ఎస్‌లో కేసీఆర్ స‌మక్షంలో చేరారు.ఆ స‌మ‌యంలో కౌశిక్‌కు మంచి ప‌ద‌వి ఇస్తామ‌ని హామీ ఇవ్వ‌డంతో గవర్నర్ కోటాలో ఆయన పేరును సిఫారసు చేస్తూ గవర్నర్‌కు పంపించారు.సాహిత్యం సైన్స్ కళలు సహకార ఉద్యమం సామాజిక సేవ అనుభ‌వమున్న వారికే ఎమ్మెల్సీ చేసే అధికారం కాబినేట్‌కు ఉటుంది.

దానిపై గ‌వ‌ర్న‌ర్ ఆమోదం తెలిపాలి.

Telugu Etela Rajender, Kaushik Reddy, Mlc Seat, Telanganan, Ts-Telugu Political

కౌశిక్ రెడ్డిపై అసంతృప్తి వ్య‌క్తం చేసిన గ‌వ‌ర్నర్.గ‌తంలో ప్రజాకవి గోరేటి వెంకన్నవిష‌యంలో ఒక్క రోజులోనే ఆమోదం తెలిపారు.కానీ రాజకీయ నేతగా ఉన్న కౌశిక్ రెడ్డి ఏ రంగంలోనే విశేష కృషి చేయ‌లేద‌ని, అందుకే గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఎమ్మెల్సీ రాదు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

మరోవైపు ఆయనపై ఉన్న కేసులు కూడా మ‌రో కార‌ణం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube