కర్ణాటకలో బీఆర్‌ఎస్ పోటీ చేయక పోవడానికి అసలు కారణం ఏంటి?

దేశ రాజకీయాల్లో కీలక పరిణామంగా భావిస్తున్న కర్ణాటక ( Karnataka )అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎందుకు పోటీ చేయడం లేదు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్( KCR ) తన ఉద్యమ పార్టీ అయిన టిఆర్ఎస్ ని దేశవ్యాప్తంగా విస్తరించే ఉద్దేశంతో బీఆర్ఎస్ గా ప్రకటించిన విషయం తెలిసిందే.

 Why Is Brs Not Contesting In Karnataka , Karnataka , Brs, Kcr, Telugu News, Trs-TeluguStop.com

జాతీయ పార్టీగా మారిన వెంటనే దేశంలో వచ్చే అన్ని ఎన్నికల్లో కూడా పోటీ చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించాడు.కానీ త్వరలో జరగబోతున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఈ పార్టీ పోటీ చేయడం లేదు.

అందుకు కారణం ఏంటి అనేది ఇప్పటి వరకు అధినేత కేసీఆర్ నుండి స్పష్టత రాలేదు.అయితే జెడిఎస్ కి ఈ పార్టీ మద్దతుగా నిలవబోతుందని అధికారికంగా ప్రకటన వచ్చింది.

బిజెపికి వ్యతిరేకంగా కేసీఆర్ కర్ణాటకలో పోటీ చేయాలని భావించడం లేదని బిజెపికి అనుకూలంగా వ్యవహరించే ఉద్దేశంతోనే జేడీఎస్‌( JDS ) కి కేసీఆర్ మద్దతు పలుకుతున్నాడు అంటూ కొందరు రాజకీయ పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు.తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా కర్ణాటకలో ప్రచారానికి వెళ్లే ఆలోచనలో ఉన్నాడు.

Telugu Karnataka, Telugu-Politics

కనీసం 10 స్థానాల్లో అయినా టీఆర్ఎస్ పోటీ చేస్తే బాగుండేది కదా అంటూ అక్కడి తెలుగు వారు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కేసీఆర్ కి దేశ వ్యాప్తంగా మంచి మద్దతు లభిస్తుందని కర్ణాటక ఎన్నికల్లో సాధించే ఓట్లను బట్టి జనాలు అనుకునే వారు.కానీ కర్ణాటకలో అసలు పోటీకే దూరంగా ఉండడంతో కేసీఆర్ పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి, రాజకీయ ప్రయోజనం కోసం జాతీయ స్థాయి పార్టీ( national level party ) అంటూ ప్రకటనలు చేసిన కేసీఆర్ పోటీ విషయంలో చేతులెత్తేయడం విడ్డూరంగా ఉంది అంటున్నారు.దేశంలో అన్ని రాష్ట్రాల నుండి పోటీ చేస్తాను అంటూ గొప్పగా ప్రకటించిన కేసీఆర్ పక్క రాష్ట్రం కర్ణాటకలోనే పోటీ చేయలేక పోతున్నాడు.

ఇక దేశ వ్యాప్తంగా పోటీ చేసేది ఎక్కడ అంటూ కేసీఆర్ ప్రత్యర్ధులు ఎద్దేవా చేస్తున్నారు.ఈ సంవత్సరం చివర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.వచ్చే సంవత్సరంలో పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నాయి.పార్లమెంటు సార్వత్రిక ఎన్నికల్లో ఆయన కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుందా అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube