విడ్డూరం : రెండు మామిడి పండ్ల దొంగతనంకు దేశ బహిష్కరణ

మన దేశంలో వందల కోట్ల రూపాయలను దోచుకుని హాయిగా తిరుగుతున్న వారికి ఎలాంటి శిక్షలు వేయలేక పోతున్నాం.బ్యాంకుల్లో పడి లూటీలు చేసిన వారికి సంవత్సరం రెండు సంవత్సరాలు జైలు శిక్షలు పడుతుంటాయి.

 Why Indians Are So Hated In Dubai-TeluguStop.com

ఇక ఇళ్లల్లో దొంగతనాలు చేసిన వారికి సంవత్సరం మించి శిక్షలే ఉండవు.అని సౌదీ, అరబ్‌ దేశాల్లో మాత్రం శిక్షలు చాలా కఠినంగా ఉంటాయనే విషయం తెల్సిందే.

తాజాగా మరోసారి ఆ విషయం నిరూపితం అయ్యింది.రెండు మామిడి కాయలను దొంగతనం చేసినందుకు గాను ఏకంగా దేశ బహిష్కరణతో పాటు భారీ మొత్తంలో జరిమానా కూడా విధించడం జరిగింది.

Telugu Deport Dubai, Indian Dubai, Telugu Nri Ups, Telugu Ups-Telugu NRI

  పూర్తి వివరాల్లోకి వెళ్తే.దుబయిలో చిన్న తప్పులకు కూడా పెద్ద శిక్షలు ఉంటాయి.ప్రతి ఒక్కరు కూడా అక్కడ చట్టంకు కట్టుబడి ఉండాల్సిందే.దుబాయిలో నేరాల శాతం చాలా చాలా తక్కువ ఉండటంకు ప్రధాన కారణం అక్కడ ఉండే కఠినమైన శిక్షలే.

అక్రమ సంబంధం పెట్టుకుంటే మరణ శిక్ష వేసే దేశంలో దొంగతనం చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.ఆ దేశంకు చెందిన వారైతే 10 ఏళ్లు జైలు శిక్ష కోటి రూపాయల వరకు జరిమానా ఉంటుంది.

కాని విదేశాలకు చెందిన వారు దొంగతనంకు పాల్పడితే మరింత కఠినమైన శిక్ష ఉంటుంది.

Telugu Deport Dubai, Indian Dubai, Telugu Nri Ups, Telugu Ups-Telugu NRI

  ఇండియాకు చెందిన ఒక 27 ఏళ్ల యువకుడు దుబాయి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్ట్‌లో పని చేస్తున్నాడు.లగేజీ సెక్షన్‌ వద్ద అతడు 2017లో డ్యూటీ నిర్వహించేవాడు.ఆ డ్యూటీలో భాగంగా అతడు బ్యాగేజీ బెల్ట్‌ పై వచ్చే బ్యాగ్స్‌ను ప్యాసింజర్లకు అప్పగించాల్సి ఉంటుంది.

అప్పుడే ఒక బ్యాగ్‌లో మామిడి పండ్లు ఉన్నాయి.ఓపెన్‌గా మామిడి పండ్లు ఉండటంతో రెండు మామిడి పండ్లను అతడు దొంగిలించాడు.

అతడి దొంగతనంపై మామిడి పండ్ల యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయ్యింది.
రెండు సంవత్సరాల పాటు ఈ కేసు విచారణ సాగింది.

ఎట్టకేలకు కోర్టు తుది తీర్పు ఇచ్చింది.మామిడి పండ్లను దొంగిలించినట్లుగా ఆవ్యక్తి ఒప్పుకోవడంతో కోర్టు అతడికి దేశ బహిష్కర శిక్ష విధించింది.

వెంటనే దేశం నుండి వెళ్లి పోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడంతో పాటు, జరిమానాగా భారీ మొత్తంలో చెల్లించాల్సిందిగా కూడా ఆదేశించింది.జరిమానా చెల్లించలేని పక్షంలో జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube