ఇండియన్ స్టూడెంట్స్ మెడికల్ స్టడీస్ కోసం ఉక్రెయిన్ ఎందుకు వెళతారంటే..

ర‌ష్యా- ఉక్రెయిన్‌లో యుద్ధ పరిస్థితుల మధ్య వందలాది మంది భారతీయులు అక్కడ చిక్కుకుపోయారు.వీరిలో వైద్య విద్య కోసం ఉక్రెయిన్‌కు వెళ్లిన‌ భారతీయుల సంఖ్య అధికంగా ఉంటుంది.

 Why Indian Students Go To Ukraine To Study Mbbs , Indian Students , Mbbs , Ukr-TeluguStop.com

ఉక్రెయిన్ మంత్రిత్వ శాఖ తెలిపిన వివ‌రాల‌ ప్రకారం మొత్తం 18,095 మంది భారతీయ విద్యార్థులు ఉక్రెయిన్ లో చ‌దువుకుంటున్నారు.వీరిలో హర్యానా మరియు పంజాబ్‌కు చెందినవారు అధికంగా ఉన్నారు.

ఎంబీబీఎస్ చదువుల కోసం పెద్ద సంఖ్యలో భారతీయ విద్యార్థులు ఉక్రెయిన్‌కు వెళుతుంటార‌ని నిపుణులు చెబుతున్నారు.భారతదేశంలో కంటే ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్‌ చేయడం చాలా సౌకర్యంగా ఉంటుంద‌ని వారంటున్నారు.

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తెలిపిన వివ‌రాల ప్రకారం ఉక్రెయిన్‌లో చేసే ఎంబీబీఎస్ కోర్సుకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది.ఇక్కడ నుండి వైద్య విద్య చేసే విద్యార్థుల‌కు ప్రపంచంలోని చాలా దేశాలలో పనిచేసే అవకాశం ల‌భిస్తుంది.

భారతీయ విద్యార్థులు ఉక్రెయిన్‌లో వైద్య విద్య‌న‌భ్య‌సించ‌డానికి ఇదే ముఖ్య కార‌ణం.

భారతదేశంలోని ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఎంబీబీఎస్‌ చదువుకు సంవత్సరానికి 10 ల‌క్ష‌ల‌ నుండి 12 లక్షల రూపాయలు ఖర్చ‌వుతుంది.

ఈ విధంగా 5 సంవత్సరాల ఈ కోర్సుకు విద్యార్థులు 50 నుండి 60 లక్షల రూపాయల వరకు ఫీజు చెల్లించవలసి వ‌స్తుంది.అయితే ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్‌ చదువు కోసం సంవత్సరానికి 4 ల‌క్ష‌ల నుంచి 5 లక్షల రూపాయలు ఖ‌ర్చ‌వుతుంది అంటే 5 సంవత్సరాల ఈ కోర్సు పూర్తి చేయడానికి అయ్యే మొత్తం ఖర్చు భారత్‌లో అయ్యే ఖ‌ర్చు క‌న్నా చాలా త‌క్కువ‌.

మ‌న దేశంలో ఎంబీబీఎస్‌లో ప్రవేశం కోసం నీట్ ప‌రీక్ష రాయాల్సి ఉంటుంది.ఈ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో ప్రవేశాలు ఉంటాయి.

భారతదేశంలో ఎంబీబీఎస్ ప్రవేశానికి నీట్‌ స్కోర్ చాలా ముఖ్యం.అయితే నీట్‌ అర్హత సాధిస్తే చాలు.

ఉక్రెయిన్‌లో వైద్య విద్య అభ్యసించ‌వ‌చ్చు.నీట్ మార్కులతో పెద్దగా పట్టింపు లేదు.

ఈ కార‌ణంగానే భారతీయ విద్యార్థులు ఎంబీబీఎస్ చేసేందుకు ఉక్రెయిన్ వెళుతుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube