ముక్కు పుడకను ఎందుకు ధరించాలో తెలుసా?

హిందూ మతంలో అనాది కాలం నుండి ధరించే సంప్రదాయం ఉంది.ముక్కు పుడక అనేది కేవలం అలంకారానికే కాకుండా మగువుల ఆరోగ్యానికి కూడా చాలా సహాయపడుతుంది.

 Why Hindu Women Wear Nose Ring-TeluguStop.com

భారతదేశంలో ప్రాంతాన్ని బట్టి ముక్కు పుడక ధరించే విధానంలో మార్పు ఉంటుంది.అయితే దాదాపుగా అన్ని సంస్కృతుల వారు ముక్కు పుడకను ధరించటం విశేషంగా చెప్పవచ్చు

సాధారణంగా ఐదు, ఏడు, పదకొండు సంవత్సరాల ఆడపిల్లలకు ముక్కును కుట్టిస్తారు.

లేకపోతే వివాహానికి సిద్దమైన ఆడపిల్లలకి కుట్టిస్తారు.ఇప్పటికీ చాలా కుటుంబాలలో వివాహ సమయానికి ఆడపిల్ల ముక్కుకి ముక్కు పుడక తప్పనిసరిగా ఉండాలని భావిస్తారు.

చిన్న వయసులో కుట్టించడం వల్ల ఆరోగ్య పరంగా చాలా మంచిది

ముక్కుకి ఎడమ వైపున చంద్ర నాడి ఉంటుంది.కనుక ముక్కుకు ఎడమ వైపున అర్థ చంద్రాకారంలోని ముక్కు పుడక ధరించాలి.

కుడివైపు సూర్యనాడి ఉంటుంది.కాబట్టి కుడి వైపున మండలాకారమైన ఒంటి రాయి ముక్కు పుడకను ధరించాలని శాస్త్రం చెప్పుతుంది.

మధ్యలో ముక్కెర ధరించాలి.ఇది సాధారణంగా ముత్యం లేదా కెంపుని బంగారంతో చుట్టించి ధరిస్తారు.

ముక్కుకి ఎడమవైపున ధరించే ముక్కు పుడక వలన ఆడవారికి గర్భకోశ సంబంధమైన వ్యాధులు తగ్గుతాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube