సినిమాలు ప్లాప్ అయితే హీరోయిన్ లదే తప్పా ? ఇదేమి లాజిక్ ?

ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్ పూజ హెగ్డే విమర్శలను ఎదుర్కొంటున్నారు.ఐరన్ లెగ్ అంటూ అందరి తోనూ మాటలు పడుతున్నారు.

 Why Heroines Are The Reason For Movie Flop, Tolllywood, Pooja Hegdhe , Sruthi Ha-TeluguStop.com

అసలు ఎందుకిలా అంటున్నారు ఆమె ఏమి చేసింది అంటే.ఒక సినిమా హిట్ అయితే ఆ క్రెడిట్ అంతా దర్శకుడికి అలాగే హీరో ఖాతాలోకి వెళుతుంది.

కానీ ఆ సినిమా ఫ్లాప్ అయితే మాత్రం వచ్చే విమర్శల్లో హీరోయిన్ కి సైతం వాటా ఎక్కువ గానే ఉంటుంది.అందులోనూ ఆ హీరోయిన్ చేసిన వరుస చిత్రాలు కనుక ఒకవేళ కర్మకాలి ఫ్లాప్ అయితే ఇక ఆ హీరోయిన్ ది ఐరన్ లెగ్ ఆమె వల్లే అసలు సినిమా ఫ్లాప్ అయ్యిందని వార్తలు వెల్లువెత్తుతాయి.

భారీ అంచనాల నడుమ విడుదలయిన ఒక సినిమా పరాజయం పాలైతే ఇక ఆ సినిమా ఫెయిల్యూర్ యొక్క కారణాలు ఇవే అంటూ రకరకాల వార్తలు వినపడుతుంటాయి.అలాంటి వార్తల్లో ఇలా హీరోయిన్ గురించి కూడా ఎక్కువనే చెప్పాలి.

కాగా ఇపుడు ఇదే తరహాలో విమర్శలకు టార్గెట్ అయ్యారు హీరోయిన్ పూజ హెగ్డే.ఇటీవల కాలంలో ఈమె చేసిన వరుస చిత్రాలు బీస్ట్, రాదే శ్యాం ఇపుడు ఆచార్య చిత్రాలు వరుసగా పరాజయం అయిన విషయం తెలిసిందే.

అయితే పూజ హెగ్డే బ్యాడ్ లక్ కారణంగానే ఆమె చేసిన చిత్రాలు ఫెయిల్ అవుతున్నాయని ప్రచారం జోరుగా కొనసాగుతోంది.ఈమె ఐరన్ లెగ్ అని ఈమె సినిమాలో ఉంటే ఇక ఆ చిత్రం ఫెయిల్ అవ్వడం కన్ఫర్మ్ అని అంటున్నారు.

మరి ఇదే హీరోయిన్ అప్పట్లో చేసిన అలా వైకుంఠ పురంలో, అరవింద సమేత వంటి చిత్రాల సక్సెస్ మాటేమిటి ఒకప్పుడు స్టార్ హీరోయిన్ శృతి హాసన్ సైతం ఇలాంటి విమర్శలే ఎదుర్కొన్నారు.ఆమెను ఐరన్ లెగ్ హీరోయిన్ అంటూ అంతా కామెంట్స్ చేశారు ఆ తరవాత మళ్లీ ఆమె సక్సెస్ ట్రాక్ ఎక్కాడు అది వేరే విషయం అనుకోండి.

Telugu Acharya, Beast, Gabbar Singh, Pooja Hegdhe, Radhya Shyam, Sruthi Hasan-La

అయితే ఇపుడు పూజ హెగ్డే కూడా ఇలాంటి నెగిటివ్ టాక్ తో టార్గెట్ అవుతుంటే ఆమె ఫ్యాన్స్ ఆందోళన లో పడ్డారు.వాస్తవానికి ఒక సినిమా జయాపజయాలలో లేడీ ఓరియంటెడ్ మూవీ అయితే తప్పితే హీరోయిన్ ప్రాధాన్యత తక్కువ గానే ఉంటుంది.అలాంటప్పుడు ఆ సినిమా సక్సెస్ మాత్రం హీరోయిన్ పై ఎలా ఆధారపడి ఉంటుంది.డైరెక్టర్ ఏ పాత్ర ఇస్తే ఆ పాత్ర చేయడం చెప్పినట్టు నటించడం అలాంటప్పుడు ఈ సక్సెస్ విషయంలో హీరోయిన్ కి రాని గుర్తింపు ఫెయిల్యూర్ అయినపుడు ఎలా వస్తుంది అంటున్నారు కొందరు సినీ విశ్లేషకులు.

అప్పట్లో ఐరన్ లెగ్ అంటూ అందరితోనూ అనిపించుకున్న శ్రుతి హాసన్ గబ్బర్ సింగ్ లాంటి మంచి సినిమా అవకాశం దొరకడంతో తన కెరియర్ లో స్పీడ్ అందుకున్నారు.లక్కీ హీరోయిన్, అన్ లక్కీ హీరోయిన్ అనడం కాదు ఆ హీరోయిన్ పాత్ర ఏమిటి ? ఆమె ఎంత వరకు ఆ పాత్రకు న్యాయం చేసింది, ఎలా ప్రేక్షకులను అలరించింది అన్నది చూడాలి అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube