సమ్మె ఆగాలంటే హరీష్ రంగంలోకి దిగాల్సిందేనా ?  

Why Harish Rao Silent In Rtc Strike-high Court,telangana Rtc

తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె కు ఇప్పటివరకు పరిష్కార మార్గం దొరకలేదు.ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయాలనే డిమాండ్ తో చేపట్టిన ఈ సమ్మె రోజురోజుకు ఉదృతం అవుతూనే ఉంది.

Why Harish Rao Silent In Rtc Strike-high Court,telangana Rtc Telugu Political Breaking News - Andhra Pradesh,Telangana Partys Coverage Why Harish Rao Silent In Rtc Strike-high Court Telangana-Why Harish Rao Silent In RTC Strike-High Court Telangana Rtc

ఈ విషయంలో ప్రభుత్వం, ఆర్టీసీ కార్మికులు ఎక్కడా వెనక్కి తగ్గకపోవడంతో ఈ సమస్య మరింత ముదురుతోంది.ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభుత్వం వ్యతిరేకమని వారితో చర్చలు జరిపింది లేదంటూ ప్రభుత్వం కొత్తవారిని నియమించేందుకు చర్యలు చేపట్టింది.

దీనిలో భాగంగానే ప్రస్తుతం తాత్కాలిక డ్రైవర్లు కండక్టర్లు విధులు నిర్వహిస్తున్నారు సమ్మెలో పాల్గొన్న కార్మికులందరూ సెల్ఫ్ డిస్మిస్ అయ్యారని కేసీఆర్ ప్రకటించడంతో కొంతమంది ఇది తమ ఉద్యోగం పోయింది అన్న బాధతో ప్రాణాలు కోల్పోగా మరి కొందరు ఆసుపత్రి పాలయ్యారు.

Why Harish Rao Silent In Rtc Strike-high Court,telangana Rtc Telugu Political Breaking News - Andhra Pradesh,Telangana Partys Coverage Why Harish Rao Silent In Rtc Strike-high Court Telangana-Why Harish Rao Silent In RTC Strike-High Court Telangana Rtc

  ఈ తరుణంలో మంగళవారం హైకోర్టు వ్యాఖ్యలు కార్మికులకు కాస్త ఊరటనిచ్చాయి.‘సమ్మెను వెంటనే విరమించి ప్రభుత్వంతో చర్చలు జరపాలని హైకోర్టు వ్యాఖ్యానించింది.ఇదే సమయంలో ప్రభుత్వ తీరును కూడా కాస్త తప్పు బట్టింది.

అయితే దీనిపై ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదు.కానీ ఆర్టీసీ జేఏసీ మాత్రం యాజమాన్యం, ప్రభుత్వం ఈ ఇద్దరిలో ఎవరు ముందుకు వచ్చి చర్చలకు పిలిచినా తాము వస్తామని, ఆ తరువాత సమ్మె విరమిస్తానని చెప్పారు.

దీనిలో భాగంగానే కెసిఆర్ ఈ సమస్యను పరిష్కరించాల్సిన గా పార్టీ సీనియర్ నాయకులు కె.కేశవరావు కు ఈ బాధ్యతలు అప్పగించారు.కానీ కేకే ఈ విషయంలో సరైన విధంగా వ్యవహారాన్ని చక్కబెట్టే లేకపోయారు.దీంతో ఇప్పుడు అందరి చూపు హరీష్ రావు మీద పడింది.

  ఆర్టీసీ జేఏసీకి, ఆర్ధిక మంత్రి హరీష్ రావుకి మధ్య స్నేహపూర్వక సంబంధం ఉన్నా కేకే ఎందుకు సీన్‌లోకి వచ్చారు అనే విషయం ఎవరికీ అంతుబట్టలేదు.గతంలో టీఎంయూ (తెలంగాణ మజూర్ యూనియన్) గౌరవాధ్యక్షుడిగా ఉన్న మంత్రి హరీష్ రావు ఆర్టీసీ సమ్మె ఉద్రిక్త రూపం దాల్చినా ఇప్పటివరకు మౌనంగా ఎందుకు ఉన్నారన్న సందేహాలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి .

కొందరైతే ఆర్టీసీ సమ్మె వెనుక ఆయన హస్తం ఉందని అభిప్రాయపడుతున్నారు.అయితే దీనిపై ఆర్టీసీ జేఏసీ కన్వినర్ అశ్వత్థామరెడ్డి స్పందిస్తూ తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు తమకు దేవుడని అన్నారు.

గతంలోనే కాదు ఎప్పుడూ ఇదే మాటకు కట్టుబడి ఉంటామన్నారు.అలాగని సమ్మెకు ఆయనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.

ఇక ప్రస్తుతం ఈ సమస్యకు స్పష్టమైన పరిష్కార మార్గం రావాలంటే తప్పనిసరిగా హరీష్ ను రంగంలోకి దించాలనే డిమాండ్లు ఇప్పుడు ప్రభుత్వం లోోనూ, ఆర్టీసీ కార్మికులలోనూ వ్యక్తం అవుతోంది.మరో రెండు రోజుల్లో ఈ సమస్యకు స్పష్టమైన పరిష్కారం మార్గం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

అయితే హరీష్ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంటారా లేదా అనే విషయంలో క్లారిటీ లేకుండా పోయింది.

తాజా వార్తలు