తిరుమల శ్రీవారి గడ్డం కింద పచ్చ కర్పూరం ఎందుకు పెడతారో తెలుసా?

తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.దేశం నలుమూలల నుంచే కాకుండా వివిధ దేశాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున స్వామి వారిని దర్శించుకుంటారు.

 Why Greencamphor Applied To Tirumala Venkateswara Swamy-TeluguStop.com

ప్రతిరోజు లక్షల సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకుంటారు.గోవిందా గోవిందా అనే నామస్మరణతో తిరుపతి వీధులు మారుమోగుతున్నాయి.

ప్రతిరోజు ఎన్నో పూజలు, ఏకాంత సేవలు గడుపుతున్న వెంకటేశ్వర స్వామికి గడ్డం కింద పచ్చ కర్పూరం ఎందుకు పెడతారో ఎప్పుడైనా ఆలోచించారా… అలా పచ్చకర్పూరాన్ని స్వామివారి గడ్డానికి ఎందుకు పెడతారో ఇక్కడ తెలుసుకుందాం….

 Why Greencamphor Applied To Tirumala Venkateswara Swamy-తిరుమల శ్రీవారి గడ్డం కింద పచ్చ కర్పూరం ఎందుకు పెడతారో తెలుసా-Devotional-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పురాణాల ప్రకారం శ్రీవారి భక్తులలో అనంతాళ్వారు స్వామివారి భక్తులలో అగ్రగణ్యుడు.

ఇతడు నిత్యం స్వామివారిని పూజిస్తూ స్వామివారి సేవలో లీనమై ఉంటాడు.ఈయన తన భక్తితో ప్రతిరోజు స్వామి వారికి పూల దండలను సమర్పించి స్వామివారి దర్శన భాగ్యం చేసుకునేవాడు.

ఒకరోజు ఆ పూలతోటను మరింత సాగు చేయాలనే ఉద్దేశంతో, తన తోటలో చెరువును తవ్వాలని నిశ్చయించుకుంటాడు.

అనంతాళ్వారు, అతని భార్య ఇద్దరే ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ చెరువును తవ్వడం మొదలుపెడతారు.

ఇతరుల సహాయం తీసుకోకుండా అనంతాళ్వారు అతని భార్య చెరువును తవ్వుతారు.చెరువును తీసే సమయంలో అనంతాళ్వారు భార్య గర్భిణీ గా ఉంటుంది.

అతను గడ్డపారతో మట్టిని తవ్వుతుంటే, అతని భార్య ఆ మట్టిని గంపలో వేసుకొని దూరంగా పడేసేది.నిండు గర్భిణీ కావడంతో ఆ పని చేయడానికి ఎంతగానో అలసి పోయేది.

అంతలోనే ఈ తతంగం అంతా చూసిన సాక్షాత్తు ఆ శ్రీనివాసుడు 12 సంవత్సరాల బాలుడు రూపంలోకి మారి అనంతాళ్వారు దగ్గరకు వెళ్లి సహాయం చేస్తానని అడుగగా అందుకు అనంతాళ్వారు ఒప్పుకోడు.కానీ అతని భార్య ఒప్పుకోవడంతో తన భార్యకు సహాయం చేస్తుంటాడు.

అది గమనించిన అనంతాళ్వారు తన భార్యను ప్రశ్నించగా ఆ బాలుడు సహాయం చేస్తున్నాడన్న విషయం ఆమె భర్తకు తెలుపుతుంది.దీంతో కోపోద్రిక్తుడైన అనంతాళ్వారుడు చేతిలో ఉన్న గుణంతో ఆ బాలుడు మీదకి విసురుతాడు.

ఆ గుణపం బాలుడి గడ్డానికి తగలడంతో తీవ్ర రక్తస్రావంతో అక్కడినుంచి ఆనంద నిలయానికి మాయమవుతాడు.

ఆనందనిలయంలో గర్భగుడిలోని విగ్రహం నుంచి రక్తం కారడం చూసి ఆలయ అర్చకులు ఆశ్చర్యపోతారు.

ఈ విషయాన్ని ఆలయ అర్చకులు అనంతాళ్వారు చెప్పగా అతను కంగారుగా అక్కడికి చేరుకుంటాడు.శ్రీవారి గడ్డం నుంచి రక్తం కారడం చూడగా తనకు సహాయం చేయడానికి వచ్చిన బాలుడు సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి అని భావించి, తన తప్పు తెలుసుకుని కన్నీరుమున్నీరవుతూ స్వామివారి పాదాలచెంత పడతాడు.

గాయం తగిలింది అన్న బాధతో అప్పట్నుంచే స్వామి వారికి చల్లదనం కోసం గంధం పూసి, దానిపై పచ్చకర్పూరం పెట్టడం ఆనవాయితీగా వస్తోంది.

#Green Camphor #SriVenkateswara #Tirumala #WhyGreen #Tirupathi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

DEVOTIONAL