వినాయకుడు, లక్ష్మీదేవిని కలిపి పూజించడానికి కారణం ఏమిటో తెలుసా?

Why Goddess Lakshmi And Lord Ganesha Are Worshipped Together

మన హిందూ ఆచారాల ప్రకారం ఎన్నో పూజా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటాము.ఈ క్రమంలోనే చాలా మంది భక్తులు తమకు సంపద కలగాలని, ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందాలని భావిస్తూ లక్ష్మీదేవికి పూజ చేయడం మనం చూస్తున్నాము.

 Why Goddess Lakshmi And Lord Ganesha Are Worshipped Together-TeluguStop.com

అయితే లక్ష్మీదేవి పూజ చేయడానికి కంటే ముందుగా వినాయకుడికి పూజ చేసి ఆ తర్వాత లక్ష్మీ దేవిని పూజిస్తుంటారు.ఈ విధంగా వినాయకుడు లక్ష్మీదేవిని కలిపి పూజించడానికి కారణం ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…

పురాణాల ప్రకారం వినాయకుడు ఆది దేవుడని మనం ఏ శుభకార్యం తలపెట్టినా ఆ కార్యం ఏ ఆటంకం లేకుండా పూర్తి కావాలని ముందుగా వినాయకుడికి పూజ చేస్తాము.

 Why Goddess Lakshmi And Lord Ganesha Are Worshipped Together-వినాయకుడు, లక్ష్మీదేవిని కలిపి పూజించడానికి కారణం ఏమిటో తెలుసా-Devotional-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ విధంగా వినాయకుడికి పూజ చేయటం వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆ కార్యక్రమం పూర్తవుతుంది.అదేవిధంగా వినాయకుడు ఎంతో తెలివైనవాడు కనుక ముందుగా వినాయకుడు పూజ చేసిన తర్వాత సంపద కోసం లక్ష్మి పూజలు చేయాలి.

అలా కాకుండా లక్ష్మీ పూజలు చేస్తే మనకు సంపద మాత్రమే వచ్చినప్పటికీ ఎలాంటి జ్ఞానం రాదు.జ్ఞానం లేకుండా మనం ఏవిధంగాను డబ్బులను సంపాదించలేము కనుక ముందుగా మనకు జ్ఞానాన్ని ప్రసాదించాలని వినాయకుడిని పూజించిన తర్వాత సంపద కలగాలని లక్ష్మీదేవికి పూజలు చేస్తాం.

ఈ క్రమంలోనే లక్ష్మీదేవికి పూజించే ముందు ముందుగా వినాయకుడిని పూజించిన తర్వాతనే లక్ష్మీదేవికి పూజ చేయాలని పండితులు చెబుతున్నారు.ఈ క్రమంలోనే ఎన్నో చిత్రపటాలలో మనకు వినాయకుడు లక్ష్మీదేవి అలాగే సరస్వతి కూడా కలిపి దర్శనమిస్తుంటారు.మనకు తెలివితేటలు జ్ఞానం ఉన్నప్పుడే సంపద వస్తుందని అందుకోసమే ముందుగా వినాయకుడి పూజ తరువాతనే లక్ష్మి పూజ చేయాలని పండితులు చెబుతుంటారు.

#Goddess Lakshmi #Bhakthi #Lakshmi #Money #Hindu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube