ఐ లవ్ యూ అని అబ్బాయిలు చెప్పగానే అమ్మాయిలు రిజెక్ట్ చేయడానికి ప్రధాన కారణాలు ఇవే.!       2018-06-18   03:39:57  IST  Raghu V

ఐ లవ్ యూ అని చెప్పెయగానే… ఐ టూ అని ప్రతి అమ్మాయి చెప్పాలని రూల్ లేదు.. నో చెప్పడానికి ఒక్కో అమ్మాయికి ఒక్కో రీజన్ ఉంటుంది.. అమ్మయి నో చెప్పడానికి కారణాలు చాలా ఉండొచ్చు..తను ఆల్రెడీ లవ్ లో ఉండొచ్చు లేదంటే తనకు మీ పై కానీ,ప్రేమపై కానీ సదభిప్రాయం లేకపోవచ్చు… ఇంక ఏ ఏ కారణాలకు అమ్మాయిలు నో చెప్తారో తెలుసుకోండి… నిజంగా మీరు ఆ అమ్మాయిని అమితంగా ఇష్టపడ్తుంటే మాత్రం ఆ పొరపాట్లు మళ్లీ చేయకండి…’

ఒక అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడిన ఇష్టపడకపోయిన వారితో మీరు చాటింగ్ చేసే సమయంలో మీకు రిప్లై రాకపోతే వెంటనే ఫోన్ చేసి aviod చేస్తున్నావ్ ఏమైంది. ఇతరత్రా ఫ్రెండ్స్ ఏమైనా దొరికారా వంటి ప్రశ్నలు అడగకూడదు. అలా అడిగితె ఆ అమ్మాయి మిమ్మల్ని కచ్చితంగా రిజెక్ట్ చేస్తుంది.

అమ్మాయిలను ఒకేలా ప్రశ్నలు వెయ్యడం, పొగడడం, అవసరం లేకుండానే తన బాగోగులు తెలుసుకోవడం… వంటివి చేస్తే అమ్మాయిలకు నచ్చదు. వాళ్లకు ఫ్రీ టైమ్ ఇవ్వకుండా ఎప్పుడు మీతోనే ఉండాలి టైమ్ స్పెండ్ చెయ్యాలి అంటే కుదరదు. వాళ్లకు వాళ్ళ పనులు చేసుకోవడానికి సమయం కావలి కదా? అది అర్ధం చేసుకోకుండా ఉంటె కూడా అమ్మాయిలు రిజెక్ట్ చేస్తారు.

అందం కంటే ఆత్మవిశ్వాసానికి అమ్మాయిలు ప్రాముఖ్యతనిస్తారు.ఆత్మవిశ్వాసం ఉన్నవారిని అమ్మాయిలు అమితంగా ఇష్టపడ్తారు. తన మీద తనకు నమ్మకం లేనివాడు జీవితంలో ఏదీ సాధించలేడు. నమ్మకం అనేది వ్యక్తిత్వంపై ప్రభావం చూపుతుంది. ఒకవేళ మీకు కూడా ఇది సమస్యే అయితే జాగ్రత్త పడండి.