వినాయకుడిని నాగభూషణడు అని ఎందుకు పిలుస్తారో తెలుసా?

హిందూ పురాణాల ప్రకారం వినాయకుడిని ప్రథమ పూజ్యుడిగా భావిస్తారు.వినాయకుడికి గణపతి, విగ్నేశ్వరుడు, ఏకదంతుడు, గణనాథుడు, లంబోదరుడు వంటి పేర్లు ఉన్నాయి.

 Story Behind Why Ganesha Wears Snakes As Ornaments , Lard Vinayaka, Nagabushana,-TeluguStop.com

ఇవే కాకుండా వినాయకుడిని నాగభూషణడు అని కూడా పిలుస్తారు.అయితే వినాయకుడిని నాగభూషణడు అని ఎందుకు పిలుస్తారో చాలామందికి తెలియకపోవచ్చు.

పురాణాల ప్రకారం వినాయకుడికి ఆ పేరు ఎలా వచ్చిందో ఇక్కడ తెలుసుకుందాం…

వినాయకుడి తమ్ముడు కార్తికేయ వివాహం ఇంద్రుని కుమార్తె దేవసేనతో నిశ్చయమైంది.ఈ క్రమంలోనే పార్వతీదేవి వినాయకుడిని ఉద్దేశించి తమ్ముడికి పెళ్లి నిశ్చయమైంది, తమ్ముడు పెళ్లి జరగాలంటే ముందుగా నీ పెళ్లి జరగాలని, పెళ్లి చేసుకోమని వినాయకుడికి చెబుతుంది.

పెళ్లి చేసుకోవడానికి వినాయకుడు ససేమిరా ఒప్పుకోకుండా అనేక సాకులు చెబుతాడు.పార్వతి దేవి మాత్రం పెళ్లి విషయంలో పట్టుబడటంతో చేసేదేమీ లేక వినాయకుడు తపస్సు చేసుకోవాలని వెళ్ళిపోతాడు.

Telugu Devasena, Hindu Puranas, Indrudu, Lard Vinayaka, Marrige, Nagabushana, Pa

అలా వెళ్లిన వినాయకుడు తపస్సు కోసం చుట్టూ పుట్టలు ఉండి ఆ పుట్టలో పాము ఉన్నటువంటి ప్రదేశాన్ని ఎంచుకుంటాడు.ఆ ప్రదేశంలో తపస్సు చేస్తుండగా పుట్టలో నుంచి పాములు నిటారుగా నిలబడి బుసులు కొడుతూ వినాయకుడి తపస్సుకు భంగం కలగకుండా రక్షణ కల్పిస్తూ ఉంటాయి.ఇంద్రుడు ఎలాగైనా విఘ్నేశ్వరుడి తపస్సు భంగం కలిగించాలని రాక్షసులకు, ‘‘మీ యజమానిని వాహనంగా చేసుకున్న విఘ్నేశ్వరుడు మిమ్మల్నందర్నీ నిర్మూలించడానికి తపస్సు చేస్తున్నాడు.పగతీర్చుకోండి!” అని చెప్పి ఉసిగొల్పాడు.

ఆ విధంగా రాక్షసులు వినాయకుడి పై దాడి చేయగా మహాసర్పాలు పాతాళం నుంచి కట్టలుగా వచ్చి వాళ్ళ పొగరు అణిచాయి.అక్కడితో రాక్షసులు అక్కడినుంచి పారిపోతారు.ఇంద్రుడు మంచి ఉల్లాసవంతులైన దేవతాపురుషుల్ని, వారితో అప్సరసలను కలిపి పంపుతూ, ‘‘విఘ్నేశ్వరుడికి ఆటంకం కలిగేలాగ మీ ప్రతాపం చూపండి అని వారిని వినాయకుడి పై ఉసి గొలపాడు.వారిపై నాగులు బుసలు కొడుతూ వారిని కాటు వేస్తూ దేవతలను స్వర్గానికి తరిమాయి.

ఈ విధంగా వినాయకుడు తపస్సుకు భంగం కలగకుండా పాములు రక్షించినందుకు వినాయకుడు సంతోషించి పాములను ఎత్తుకొని వాటిని ఆభరణాలుగా ధరించి కైలాసానికి వెళ్తాడు.ఈ విధంగానే పాములు వినాయకుడికి ఆభరణాలుగా మారడంతో వినాయకుడు నాగభూషణడు అయ్యాడు.

అప్పటినుంచి వినాయకుడిని నాగభూషణడు అనే పేరుతో కూడా పిలుస్తారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube