అగ్నిమాప‌క వాహ‌నాల‌కు ఎర్ర‌రంగు ఎందుకుంటుంది?... చ‌రిత్ర తెలుసుకుంటే ఆశ్చ‌ర్య‌పోతారు!

రోడ్డుపై వెళుతున్న‌ అగ్నిమాపక వాహ‌నానికి అంద‌రూ దారి ఇస్తారు.తద్వారా అది సరైన సమయంలో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతుంది.

 Why Fire Brigades Are Red Accidents Fire Staff Colour India America, Redd Coluor-TeluguStop.com

అగ్నిమాపక వాహ‌నం ఎరుపు రంగులో ఎందుకు ఉంటుందోన‌ని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? సైన్స్ ఏబీసీ తెలిపిన వివ‌రాల‌ ప్రకారం, అగ్నిమాపక యంత్రానికి ఎరుపు రంగు వేయ‌డం వెనుక అనేక సిద్ధాంతాలు ఉన్నాయి.

మొదటి సిద్ధాంతం ప్రకారం 1900ల‌లో ఎక్కువగా ఫోర్డ్ కంపెనీ కార్లు రోడ్లపై కనిపించేవి.

అవన్నీ నలుపు రంగులో ఉండేవి.అందువల్ల అగ్నిమాపక యంత్రం దూరం నుండి కనిపించేలా, ఇతర వాహనాలు దానికి ముందుకు వెళ్లడానికి దారి ఇచ్చేందుకు ఆ వాహ‌నానికి ఎరుపు రంగును ఎంచుకున్నారు.

అగ్నిమాపక యంత్రాన్ని 1732లో రిచర్డ్ న్యూషామ్ కనిపెట్టాడని చ‌రిత్ర‌ చెబుతోంది.అతను దాని ఇంజన్‌కు ఎరుపు రంగు వేశాడు.

Telugu America, Brigades, Engine, Ford Company, India, Richard Newsham, Yellow-L

అప్పటి నుండి అదే రంగు స్థిర‌మ‌య్యింది.దాని రంగు గురించి మరొక సిద్ధాంతం ఉంది.ఆ సమయంలో అగ్నిమాపక విభాగం ద‌గ్గ‌ర ఎక్కువ డబ్బు లేక‌పోవ‌డంతో ఎరుపు రంగుతో స‌రిపెట్టార‌ని ఒక రిపోర్టు చెబుతోంది.ఆ కాలంలో ఇత‌ర రంగుల కంటే ఎరుపు రంగు చాలా తక్కువ ధరకు ల‌భించేంద‌ట‌ అందుకే అగ్నిమాపక సిబ్బంది త‌మ వాహ‌నానికి ఎరుపు రంగు వాడార‌ట‌.

కొన్ని దేశాల్లో అగ్నిమాప‌క వాహ‌నాలు ఎరుపు రంగుకు బదులుగా పసుపు, ఆకుపచ్చ రంగుల‌లో క‌నిపిస్తాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube