కాకికి ఆహారం ఎందుకు పెడతారో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

సాధారణంగా భారత దేశంలో చాలా మంది ప్రజలు కాకులకు ఆహారం అందిస్తుంటారు.కొందరు ప్రజలు కాకుల కోసం స్పెషల్ గా ఆహారాన్ని ఇళ్ల ప్రాంగణంలో వదిలేస్తుంటారు.

 Why Feed The Crow Crow, Food, Latest News, Eating, Reason , Shani, Devotiona-TeluguStop.com

ఇలా కాకికి ఎందుకు ఆహారం అందిస్తారో నేటి ప్రజల్లో చాలామందికి తెలియకపోవచ్చు.ఈ తరుణంలో కాకికి ఆహారం ఎందుకు పెడతారో వివరంగా తెలుసుకుందాం.

చాలా మంది ప్రజలు ప్రాయశ్చిత్తం కోసం, మరికొందరు పితృదేవతల కోసం కాకులకు భోజనం పెట్టడం పరిపాటే.ప్రతిరోజూ ఉదయం సమయంలో కాకులకు అన్నం తినిపిస్తే తమ కర్మఫలాలు తొలగిపోతాయని కొంతమంది విశ్వసిస్తుంటారు.

నిజానికి మన పూర్వీకులకు కాకులకు భోజనం పెట్టడం ఒక ఆచారంగా ఉండేది.అంతేకాదు కాకికి ఆహారం పెట్టడం వెనుక చాలా రహస్య ప్రయోజనాలే దాగున్నాయి.ముఖ్యంగా మన పూర్వీకులు కాకిని శని దేవుడిగా భావిస్తుంటారు.అయితే శని గ్రహం వల్ల కలిగే ప్రభావాన్ని తొలగించుకునేందుకు కాకినే శని దేవుడిగా భావించి భోజనం పెడతారు.

శనిదేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధిస్తే ఆయన ప్రభావం తగ్గుతుందని నమ్ముతారు.అలా కాకికి భోజనం పెడుతుంటారు.

Telugu Crow, Devotional, Latest, Scientific, Shani-Latest News - Telugu

కాకికి భోజనం పెట్టే ముందుగా ప్రతి శనివారం నవగ్రహాలయానికి వెళ్లి మంచి నూనెతో దీపారాధన చేస్తూ తొమ్మిదిసార్లు నవగ్రహ పూజ చేయాలి.తరువాత ప్రతిరోజు వండే ఆహారాన్ని ఆరగించే ముందు.కాకికి తినిపించాలి.ఇలా చేస్తే మీ కర్మ ప్రతిచర్యలన్నీ మటుమాయమవుతాయని చెబుతారు.అలాగే కాకుల రూపంలో చనిపోయిన పూర్వీకులు వస్తుంటారని భావించి వాటికి ఫుడ్ ఆఫర్ చేస్తుంటారు.

దీని వెనుక సైంటిఫిక్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.

సాధారణంగా కాకులకి ప్రతిరోజు ఆహారం అందిస్తే అవి మన ఇంటి చుట్టే తిరుగుతాయి.ఈ క్రమంలో ఇంటి చుట్టుపక్కల ఏవైనా జీవులు చనిపోతే వాటిని కాకులు క్లీన్ చేస్తాయి.

అలాగే ఆహారంలో ఏదైనా విషం కలిస్తే.ఆ విషయాన్ని కాకులు వెంటనే పసిగట్టగలుగుతాయి.

అందుకే ఆహారం తినే ముందు వాటికి కాస్త పెట్టి.ఆ తర్వాత ఆహారాన్ని తింటుంటారు.

తమిళనాడులోని ప్రజలు ఈ ఆచారాన్ని ఇప్పటికీ విస్తృతంగా పాటిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube