కాశీకి వెళ్లినప్పుడు ఇష్టమైన వాటిని ఎందుకు వదులుతారో తెలుసా?

పరమాత్మ ఈ శరీరం, ఇంద్రియాలు, బుద్ది, మనస్సు, అవయవాలు అన్నిటిని ఇచ్చారు.పరమాత్మ ఇచ్చిన వీటితో ఆయనకు సేవ చేయాలి.

 Why Favorite Things Are Left In Kashi Details, Favorite Things, Left In Kashi, K-TeluguStop.com

మనస్సుతో ధ్యానం చేయటం,చేతులతో పూజ చేయటం, నాలుకతో భగవంతుణ్ణి నామస్మరణ చేయటం,కనులతో స్వామిని చూడటం,చెవులతో భగవంతుని కథలను వినటం,భగవంతుని పాదాలపై ఉంచిన తులసి మాలను ముక్కుతో వాసన చూడటం, కాళ్లతో దేవాలయాలకు, భక్తుల ఇళ్లకు వెళ్ళటం, మాట్లాడిన నాలుగు మాటలలో ఒకటి భగవంతుని గురించి మాట్లాడటం వంటివి చేస్తే సంసారంలో ఉన్నా సన్యాసంలో ఉన్నట్టే.?

కానీ కన్ను, ముక్కు, చెవులు, నాలుకకు ప్రకృతిలో లభించేవే ఇష్టం.ఇలా చేయటం ఎవరికైనా కష్టమే.మన ఇష్టాల కోసం భగవంతుని వదులుకుంటున్నాం.ఈ విధంగా చేయటం వలన కష్టాలే ఎక్కువగా వస్తాయి.ఎక్కువగా తింటే అజీర్ణం వంటివి వస్తాయి.

భగవంతుణ్ణి వదిలి ఇష్టాలను పట్టుకుంటే కష్టాలు ఎదురవుతాయి.అదే మన శరీరానికి బాగా ఇష్టమైన వాటిని భగవంతుని కోసం వదిలితే మనసు, బుద్ధి, శరీరం ప్రసన్నంగా, ఆరోగ్యంగా ఉంటాయి.

Telugu Devotional, Favorite, Fruits, Kashi, Pooja, Telugu Bhakthi, Varanasi, Veg

ఇలా ఇష్టమైన అన్నింటిని వదిలేస్తే కష్టం కాబట్టి ఒక్కో క్షేత్రంలో ఒక్కో ఇష్టాన్ని వదిలితే కోరికలు తగ్గుతాయి.ఇలా కాశీలో వదిలిన వాటిని జీవితంలో అసలు ముట్టుకోరు.కాశీలో వదిలిన కూరగాయ, పండు ఇలా ఏదైనా ఒకసారి వదిలితే వాటి జోలికి అసలు వెళ్ళరు.ఇలా వదలటంలో పరమార్ధం ఏమిటంటే శరీరంలో కోరికలు తగ్గి మనస్సు ప్రశాంతంగా, నిగ్రహంగా ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube