ప్రతి బోయింగ్ విమానం నంబర్ 7తో ఎందుకు మొద‌ల‌వుతుందో తెలుసా?

అమెరికాకు చెందిన బోయింగ్ వైమానిక సంస్థ తరచూ వార్త‌ల్లో నిలుస్తుంది.ప్రతి బోయింగ్ విమానం నంబర్ 7తో మొదలవుతుందని మీకు తెలుసా?.దీనికి గ‌ల కార‌ణాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే ఇక చ‌ద‌వండి.ముందుగా 7 యొక్క అర్థం ఏమిటి? ఈ 7 కి సంబంధించిన‌ కథ ఏమిట‌నే వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.707 అనే నంబర్ బోయింగ్ జెట్‌లో ప్రయాణించగల ప్రయాణికుల సంఖ్యను సూచిస్తుందని చాలామంది అనుకుంటారు.అయితే వాస్తవం వేరే ఉంది.

 Why Every Boeing Aircraft Starts With Number 7 Details, Flight America Passenger-TeluguStop.com

బోయింగ్ త‌న సౌలభ్యం కోసం 7 నంబర్‌ను ఉపయోగించింది.

ఈ విమానం యొక్క గుర్తింపు సంఖ్య.

ఇంజనీర్‌లకు వివిధ బోయింగ్ ఉత్పత్తుల మధ్య తేడాను గుర్తించడంలో సహాయపడుతుంది.బోయింగ్ మొదటి వాణిజ్య ప్రయాణీకుల విమానయాన సంస్థను ప్రారంభించిన‌ప్పుడు దానికి 707 నంబర్ కేటాయించార‌ని కూడా కొందరు చెబుతుంటారు.

బోయింగ్ 707 ప్రయోగాన్ని.జెట్ యుగం ప్రారంభం అని కూడా అంటారు.

అప్పటి నుండి ప్రతి జెట్ నంబర్ 7తో ప్రారంభమై దానితోనే ముగియాలని నిర్ణయించింది.అదే సమయంలో, బోయింగ్ 7 నంబర్‌ను వాణిజ్య జెట్‌లకు మాత్రమే ఉపయోగించాలని నిర్ణయించింది.

బోయింగ్ జెట్‌లు తొలుత‌ 100 నంబర్‌తో ప్రారంభమయ్యేవి.సింగిల్ వింగ్ డిజైన్ కోసం బోయింగ్ 200ని ఉపయోగించింది.300 మరియు 400 ప్రొపెల్లర్‌లతో కూడిన వాణిజ్య విమానాలు.టర్బో ఇంజిన్ ఎయిర్‌క్రాఫ్ట్ కోసం 500 నంబర్ ఉపయోగించారు.600 అంటే క్షిపణి మరియు రాకెట్ ఆధారిత పరికరాలు.700 అంటే వాణిజ్య జెట్‌లైనర్లు.

Why Do Boeing Plane Models Starts With The Number

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube