అతడు మ్యాచ్ లో రెండు టోపీలు ఎందుకు ధరించాడో తెలుసా..?!

భారతదేశంలో క్రికెట్ అభిమానులకు కొదవ లేదంటే నమ్మండి.దేశంలో వయసుతో సంబంధం లేకుండా చిన్న పెద్ద అని వేదం ఏమీ లేకుండా ఎంతోమంది క్రికెట్ ను ఆడడం చూడడం వంటివి చేస్తూనే ఉండడం గమనిస్తూనే ఉంటాం.

 Why Eoin Morgan Wearing Two Caps In Cricket Match , Two Caps, Reason, Wear, Vira-TeluguStop.com

క్రికెట్ అనేది ఒక ఎమోషన్.ఏదైనా టీమ్ తో ఇండియా మ్యాచ్ ఆడుతున్నప్పుడు మన జట్టు గెలవాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుంటాము.

కానీ మిగిలిన దేశాలకు సంబంధించిన క్రికెట్ ప్లేయర్ లకు కూడా మన భారతదేశంలో చాలా మంచి పేరుంది.వేరే దేశం యొక్క క్రికెట్ ప్లేయర్ లను కూడా మన వాళ్లు బాగా ఫాలో అవుతారు.

వారిలో పేరుమోసిన ఆటగాడు ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఒకరు.

ప్రస్తుతం ఐపీఎల్ లో కలకత్తా నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్నాడు.

అయితే ఈ మధ్య ఇయాన్ మోర్గాన్ నికి సంబంధించిన విషయము ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.అదేంటంటే.టీమిండియాతో జరిగిన సిరీస్ లో ఇయాన్ మోర్గాన్ రెండు క్యాప్స్ పెట్టుకొని కనిపించాడు.ఇయాన్ మోర్గాన్ ఇలా రెండు క్యాప్స్ పెట్టుకోవడానికి చాలా ముఖ్యమైన కారణం ఉంది.

అలా ఎందుకు చేశారు అంటే.ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా ఒకరి చేతి నుండి మరొకరి చేతికి ఒక వస్తువును ఇవ్వడానికి బాగా ఆలోచిస్తున్నాము.

ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఐసీసీ ఒక నిర్ణయం తీసుకుంది.ప్లేయర్స్ వారి వస్తువులను అంపైర్ కు ఇవ్వకూడదు అని ఆర్డర్ జారీ చేసింది.

అయితే, అదే బయో బబుల్లో ఉన్న ప్లేయర్స్ కి వారి వస్తువులను ఇవ్వవచ్చు.

Telugu Bio Bubble, Corona Effect, England Cricket, Eoin Morgan, Ups, Caps, Lates

అందువల్ల ఒకే ఫీల్డ్ లో ఉన్న ప్లేయర్ బౌలింగ్ కి వెళ్ళినప్పుడు తమ క్యాప్స్ ను మరో ఆటగాడికి ఇచ్చి ఓవర్ అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి తీసుకుంటారు.అందుకే ఇక్కడ ఇయాన్ మోర్గాన్ రెండు క్యాప్ లతో మనకు కనిపించారు.ఒక్క ఇయాన్ మోర్గాన్ మాత్రమే కాకుండా.

ఎంతోమంది ప్లేయర్లు ఈ రూల్ ఇప్పుడు ఫాలో అవుతున్నారు.కావున ఇయాన్ మోర్గాన్ రెండు క్యాప్స్ లను పెట్టుకోవాల్సి వచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube