ప్రాణాలు పోతుంటే ప్రశ్నించవా పవన్ కళ్యాణ్ ?

సినిమా నటుడుగా ఉన్నప్పుడు ఎవరూ పవన్ కళ్యాణ్ ప్రతీ విషయం మీదా రియాక్ట్ అవ్వాలి అని కోరుకోలేదు, అలా కోరుకోవడం కూడా కరెక్ట్ కాదు.కానీ ఇప్పుడు కళ్యాణ్ సినిమా స్టార్ కంటే ముందు రాజకీయ నాయకుడు.

 Why Don’t You Question Now,mr. Pawan Kalyan?-TeluguStop.com

ఒక పార్టీ కి పెద్ద లీడర్.అధికార పార్టీ కి ఫ్రెండ్ కూడా.

ముఖ్యమైన ఘటనల విషయంలో నేను సైలెంట్ గా ఉంటా అంటే కుదరదు ఖచ్చితంగా రియాక్ట్ అయ్యి తీరాల్సిందే.

చంద్రబాబు డైరెక్షన్‌లోనో లేదంటే బీజేపీ డైరెక్షన్‌లో మాత్రమే పవన్‌కళ్యాణ్‌ స్పందిస్తారు.రిమోట్‌ కంట్రోల్‌ ఆ రెండు పార్టీల దగ్గరా వుంది మరి.‘ప్రశ్నిస్తా.’ అంటూ రాజకీయాల్లోకి వచ్చిన పవన్‌కళ్యాణ్‌ని జనం ప్రశ్నిస్తున్నా, ఆయన రాజకీయ తెరపై కన్పించడంలేదాయె.! హైద్రాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే, ఈ ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంటే, పవన్‌కళ్యాణ్‌ కనీసం ట్విట్టర్‌లో కూడా స్పందించకపోవడం విస్మయం కలిగిస్తోంది.

ఆ మాటకొస్తే, నాగార్జునా యూనివర్సిటీలో విద్యార్థిని రిషితీశ్వరి ఆత్మహత్య చేసుకున్న ఘటనపైనా పవన్‌ స్పందించలేదు.ప్రస్తుతానికి పవన్‌లో స్పందించే నాడులే స్పందన లేకుండా పోయాయని అనుకోవాలేమో.గ్రేటర్ హైదరాబాద్ ఎలెక్షన్ కోసం పవన్ తో రాజకీయం చేయిద్దాం అని టీడీపీ – బీజేపీ ప్లాన్ లు వేస్తున్నాయి.సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ కోసం ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్న ఆయన ఒక్కసారైనా రోహిత్ విషయంలో కనపడితే బాగుండేది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube