మీ పిల్లలకి ఆకలి తక్కువగా వేస్తోందా ?  

దాదాపు ప్రతి ఇంట్లో ప్రతి తల్లి తన పిల్లల గురించి చెప్పే మొదటి కంప్లయింట్ “తిండి సరిగా తినట్లేదు”. ఇది కేవలం కంప్లయింట్ కాదు, చాలా ఇళ్ళల్లో పిల్లలు ఇలానే ఉంటున్నారు. టైంకి తినడం జరగదు, తినడానికి కూర్చున్నా, ఎప్పుడు లేచి వెళ్దామా అన్నట్లుగా ఎదో ఇలా మొదలుపెట్టి, అలా ముగించేస్తారు. మరి పిల్లలు ఇలా ఎందుకు తయారవుతున్నారు? వారికి ఆకలి ఎందుకు వేయట్లేదు? దీని వెనుక ఒకటి రెండు కాదు, చాలా కారణాలే ఉన్నాయి. మీ పిల్లలు ఏ కారణంతో సరిగా తినట్లేదో తెలుసుకోండి.

* ఎప్పుడు పెట్టే ఆహారమే రోజూ పెడుతూ ఉంటే కూడా తిండి మీద ధ్యాస తగ్గుతుంది పిల్లలకి. కాబట్టి ఆసక్తికరమైన వంటకాలు చేస్తూ ఉండాలి.

* నూనే ఎక్కువగా వాడిన ఆహరం పెట్టవద్దు. ఫ్యాట్స్ ఎక్కువగా శరీరంలో పడ్డాక, మరో పూట ఆకలి సరిగా వేయదు.

* కొందరు పిల్లలు బయటకి ఎక్కువగా వెళ్ళరు. ఇంట్లోనే టీవి, కంప్యుటర్, స్మార్ట్ ఫోన్ మీద కూర్చుంటారు. ఇలాంటివారి గురించి మాట్లాడితే క్యాలరీలు ఎక్కువగా ఖర్చు కావు కాబట్టి ఆకలి కూడా ఎక్కువగా వేయదు. కాబట్టి పిల్లలు బయటకి వెళ్ళి ఆటలు ఆడకునేలా ప్రోత్సహించండి.

* పిల్లల ఎత్తుని దృష్టిలో ఉంచుకోవాలి. అలాగే ఫిజిక్ ని. వారి తాహతుకి మించి తినలేరు. కాబట్టి బాడి టైప్ ని బట్టి వారికి ఎంత మోతాదులో ఆహరం ఇవ్వాలో చూడండి.

* చిరుతిళ్ళు ఎక్కువగా తినే అలవాటు ఉంటే కూడా పిల్లలకి సరిగా ఆకలి వేయదు. అలాంటి అలవాటు పిల్లలకి ఉంటే మానిపించండి.