హనుమంతుడికి తమలపాకు అంటే ఎందుకు ఇష్టమో తెలుసా? Devotional Bhakthi Songs Programs       2017-09-22   23:16:53  IST  Raghu V

లంకా దహనం అయ్యాక హనుమంతుని శరీరానికి గాయాలు అయ్యాయి. అప్పుడు శ్రీరామచంద్రుడు హనుమంతుణ్ణి పక్కన కుర్చోబెట్టుకొని ఆ గాయాలపై తమలపాకును ఉంచాడట. ఆలా చేయటం వలన హనుమంతుని గాయాలు బాధ పెట్టకుండా చల్లగా ఉండి ఉపశమనం కలిగించిందట. ఇక అప్పటి నుంచి హనుమంతునికి తమలపాకు మీద ఇష్టం ఏర్పడిందని చెప్పుతారు.

అందుకే హనుమంతునికి తమలపాకు పూజ చేస్తే మనం కోరుకున్న కోరికలు నెరవేరతాయి. అంతేకాక తమలపాకే కాకూండా రకరకాల పువ్వులతో పూజ చేసిన హనుమంతుడు ప్రీతి చెందుతారు. హనుమంతుడు రకరకాల పువ్వులంటే ఎందుకు ఇష్టమో …. దానికి కూడా ఒక ప్రత్యేక కారణం ఉంది. అది ఏమిటంటే శ్రీరాముడు .. సూర్యవంశానికి చెందినవాడు. అలాంటి సూర్యుడి వలన అనేక రకాల జాతుల మొక్కలు ఎదుగుతాయి. ఆ సూర్యభగవానుడే తనకి గురువు. ఆ గురువు నుంచి వచ్చే కిరణాల వల్లనే పూలు వికసిస్తూ ఉంటాయి. అలాంటి పూలతో పూజలందుకోవడం తన అదృష్టంగా హనుమంతుడు భావిస్తాడట .. ఆనందంతో అనుగ్రహిస్తాడట. అందువల్లనే హనుమంతుడిని వివిధ రకాల తాజా పూలతో పూజించడం ఎట్టి పరిస్థితిలో మరిచిపోకూడదు.

,