హనుమంతుడికి తమలపాకు అంటే ఎందుకు ఇష్టమో తెలుసా?

లంకా దహనం అయ్యాక హనుమంతుని శరీరానికి గాయాలు అయ్యాయి.అప్పుడు శ్రీరామచంద్రుడు హనుమంతుణ్ణి పక్కన కుర్చోబెట్టుకొని ఆ గాయాలపై తమలపాకును ఉంచాడట.

 Why Doing Tamalapaku Pooja To Hanumanji , Hanumanji , Tamalapaku, Pooja-TeluguStop.com

ఆలా చేయటం వలన హనుమంతుని గాయాలు బాధ పెట్టకుండా చల్లగా ఉండి ఉపశమనం కలిగించిందట.ఇక అప్పటి నుంచి హనుమంతునికి తమలపాకు మీద ఇష్టం ఏర్పడిందని చెప్పుతారు.

అందుకే హనుమంతునికి తమలపాకు పూజ చేస్తే మనం కోరుకున్న కోరికలు నెరవేరతాయి.అంతేకాక తమలపాకే కాకూండా రకరకాల పువ్వులతో పూజ చేసిన హనుమంతుడు ప్రీతి చెందుతారు.హనుమంతుడు రకరకాల పువ్వులంటే ఎందుకు ఇష్టమో దానికి కూడా ఒక ప్రత్యేక కారణం ఉంది.అది ఏమిటంటే శ్రీరాముడు సూర్యవంశానికి చెందినవాడు.

అలాంటి సూర్యుడి వలన అనేక రకాల జాతుల మొక్కలు ఎదుగుతాయి.ఆ సూర్యభగవానుడే తనకి గురువు.

ఆ గురువు నుంచి వచ్చే కిరణాల వల్లనే పూలు వికసిస్తూ ఉంటాయి.అలాంటి పూలతో పూజలందుకోవడం తన అదృష్టంగా హనుమంతుడు భావిస్తాడట .ఆనందంతో అనుగ్రహిస్తాడట.అందువల్లనే హనుమంతుడిని వివిధ రకాల తాజా పూలతో పూజించడం ఎట్టి పరిస్థితిలో మరిచిపోకూడదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube