శునకాలు చాలా వరకు వాహనాల టైర్స్ వద్దే మూత్రం చేస్తాయి.. ఎందుకో ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా..!?

ఈ ప్రపంచంలో చాలా మంది కుక్కల్ని పెంచుకుంటూ ఉంటారు.జంతువులలో కుక్కలు చాలా విశ్వాసమైనవి.

 Why Dogs Urinate At Vehicles Tyres What Is The Reason Details, Dogs, Toilet, Lat-TeluguStop.com

ఇవి విశ్వాసంగా ఉంటూ తమ యజమానులను గౌరవంగా చూస్తాయి.చెప్పినట్లుగా వింటాయి.

ఇంటికి, ఊరికి కాపలాగా ఉంటాయి.అందుకే వీటిని గ్రామ సింహాలు అని అన్నారు.

తమ యజమానులు ఒకవేళ కనిపించకుండా ఉంటే ఈ కుక్కలకు ముద్ద దిగదు.భోజనాలు మానుకోని మరీ తమ యజమానుల కోసం పడిగాపులు కాస్తాయి.

కుక్కలు అంత ప్రేమ ఉందని అందరికీ తెలుసు.అయితే ఈ కుక్కలలో ఒక చెడు అలవాటు ఉంది.

అవి ఎక్కడబడితే అక్కడ మూత్రం పోస్తూ ఉంటాయి.అన్ని కుక్కలు కాకపోయినా కొన్ని పెట్ డాగ్స్ అలవాటు ప్రకారంగా ఎక్కడబడితే అక్కడ మూత్రం పోస్తూ ఉంటాయి.

దీనిని చాలా మంది గమనించి ఉండరు.

కుక్కలు మూత్ర విసర్జన చేసే సమయంలో చాలా మంది కొన్ని విషయాలను గమనించి ఉండరు.

ఈ కుక్కలు కావాలనే కొన్ని వాహనాల టైర్ల మీద మూత్ర విసర్జన చేస్తూ ఉంటాయి.అన్నీ వాహనాలు కాకపోవచ్చు కానీ కొన్ని వాహనాల టైర్ల వద్దకు వెళ్లి ఈ కుక్కలు కాళ్లు పైకి ఎత్తి మూత్రం పోస్తాయి.

వాటి చుట్టుపక్కల చాలా ఖాళీ ప్రాంతాలు ఉన్నప్పటికీ ఇవి ఆ టైర్ల మీద ఎందుకు పోస్తాయో ఇంత వరకూ చాలా మందికి తెలీదు.మామూలుగా మనం చూస్తూ వాహనాలు చాలా ప్రాంతాల్లో తిరుగుతుంటాయి.

Telugu Dogs, Dogs Urinate, Dust, Latest, Toilet, Vehicles, Wastage, Wheels-Lates

అందులో భాగంగా కొన్నిచోట్ల తారురోడ్డుపై ఇంకొన్నిచోట్ల మట్టిరోడ్లపై, మరికొన్ని చోట్ల బురదపై ఆ వాహనాలు అనేవి తిరుగుతూ ఉంటాయి.తారు రోడ్లు చూస్తే కొంత శుభ్రంగానే ఉంటాయి.కానీ మిగిలిన రోడ్లపై తిరిగినప్పుడు టైర్లకు చెత్తాచెదారం అంటుకుంటూ ఉంటుంది.అది కంటికి కనిపించదు.అయితే ఆ చెత్త కంపుకొడుతుండటం మనం గమనించవచ్చు.చెత్త వాసన రావడంతో కుక్కలు వాటిని చెత్త ప్రదేశం అనుకుని మూత్ర విసర్జన చేస్తాయి.

కేవలం వాసన వల్లే అవి అలా మూత్ర విసర్జన చేస్తాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube