ఎవరైనా ఆవులిస్తే మనం కూడా ఎందుకు ఆవులిస్తాం?.. ఇదే రీజన్!

యానిమల్ బిహేవియర్ జర్నల్‌లో ప్రచురించిన పరిశోధనా వివరాల ప్రకారం, మెదడుతో ఎక్కువగా పనిచేసేవారు ఎక్కువగా ఆవులిస్తూ ఉంటారనే అంశం వెల్లడయ్యింది.దీనికి కారణం ఏమిటో తెలుసా? దీని వెనుక సైన్స్ దాగి ఉంది.ఈ సంగతి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.ఎవరైనా ఆవులించడం లేదా ఆవులించడం చూసినపుడు మనం కూడా ఆవులించడం మొదలుపెడతాం.దీనికి రాత్రి నిద్రపట్టలేదని, నిద్ర సరిపోవడం లేదనే కారణాటు చెబుతుంటాం.అయితే ఎదుటివారు ఆవులించడం చూసి, మనం కూడా ఆవలించడం వెనుక కారణం ఉంది.

 Why Does Yawning Come After Seeing Others Doing The Same,journal Of Animal Behavior,yawning, Others Doing The Same,the Mirror Neuron System Is Active,special Relationship With The Brain-TeluguStop.com

దానికి మన మెదడుతో ప్రత్యేక సంబంధం ఉంది.దీనిపై కొన్ని పరిశోధనలు కూడా గతంలో జరిగాయి.

అమెరికాలో గల న్యూజెర్సీలోని ప్రిన్స్‌టన్ యూనివర్శిటీ చేపట్టిన పరిశోధన ప్రకారం మనిషి ఆవలించడం అనేది మెదడుకు సంబంధించినది.పని చేస్తున్న సందర్భంలో మన మెదడు వేడెక్కతుంది.

 Why Does Yawning Come After Seeing Others Doing The Same,Journal Of Animal Behavior,Yawning, Others Doing The Same,The Mirror Neuron System Is Active,Special Relationship With The Brain-ఎవరైనా ఆవులిస్తే మనం కూడా ఎందుకు ఆవులిస్తాం.. ఇదే రీజన్-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దానిని చల్లబరిచే ప్రక్రియలో భాగంగానే మనకు ఆవులింతలు వస్తుంటాయి.ఫలితంగా మన శరీర ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది.

18 ఏళ్ల క్రితం 2004లో మ్యూనిచ్‌లోని సైకియాట్రిక్ యూనివర్శిటీ ఆసుపత్రిలో దీనికి సంబంధించి ఒక అధ్యయనం చేశారు.దీనిలో ఆవులింత కారణంగా ఇన్‌ఫెక్షన్ వ్యాపిస్తుందని వెల్లడైంది.300 మందిపై నిర్వహించిన ఒక సర్వేలో 150 మంది ఇతరులను చూసి ఆవులించడం మొదలుపెట్టినట్లు తేలింది.శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం ఒక వ్యక్తి తన ఎదుటనున్న వ్యక్తి ఆవులించడం చూసినప్పుడు అతనిలోని మిర్రర్ న్యూరాన్ వ్యవస్థ యాక్టివ్ అవుతుంది.

ఈ యాక్టివ్ మిర్రర్ న్యూరాన్ వ్యవస్థ ఎదుటివారి ఆవులింతను అనుకరించమని ప్రేరేపిస్తుంది.ఆవులించేవారిని చూడగానే మనం కూడా ఆవులించాలి అనిపించడానికి ఇదే ప్రధాన కారణం.డ్రైవింగ్ చేసే వారికి కూడా ఇది వర్తిస్తుంది.ఎవరైనా కారులోని డ్రైవర్ పక్కన సీటులో కూర్చొని ఆవులిస్తే, వారిని చూసిన డ్రైవర్ ఆవలించడం మొదలుపెడతాడు.

అటువంటి పరిస్థితిలో అతని మెదడు అతనిని నిద్రపోయేందుకు ప్రేరేపిస్తుంది.ఫలితంగా ప్రమాదాలు జరిగే అవకాశముంటుంది.

అందుకే డ్రైవర్ పక్కన కూర్చున్న వ్యక్తి ఆవలించడం లేదా నిద్రపోవడం చేయకూడదని చెబుతుంటారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube