వర్షం తర్వాత మ‌ట్టి వాసన ఎందుకు వస్తుంది?... దీని వెనుక కార‌ణం తెలిస్తే..

వర్షం తర్వాత మట్టి నుండి విచిత్ర‌మైన వాసన రావ‌డాన్ని మీరు గుర్తించేవుంటారు.సీజన్‌లో మొదట వర్షం కురిసినప్పుడు.

 Why Does Soil Smell After Rain People Like Plants Action, Soil Smell , After Rai-TeluguStop.com

వర్షపు చుక్కలు నేలపై పడినప్పుడు ఈ వాసన అత్య‌ధికంగా వ‌స్తుంది.చదును చేయని నేలపై వర్షపు చినుకులు పడినప్పుడు, అది చిన్న గాలి బుడగలుగా మారుతుంది.

ఈ బుడగలు పగిలిపోయే ముందు పైకి కదులుతాయి.గాలిలోని అతి చిన్న కణాలను బయటకు పంపుతాయి, వీటిని ‘ఏరోసోల్స్‘ అంటారు.

సైన్స్ డాట్ ఓఆర్‌జీ నివేదిక ప్రకారం వర్షం తర్వాత మ‌ట్టి నుండి వచ్చే సువాసనను పెట్రిచోర్‌ అని అంటారు.బ్యాక్టీరియాతో పాటు మొక్కల నుండి వచ్చే నూనె.

మ‌ట్టి వాసనకు కారణమవుతుంది.

కేంబ్రిడ్జ్‌లోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని మెకానికల్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కల్లెన్ బుయ్ తెలిపిన వివ‌రాల ప్రకారం మొక్కలు విడుదల చేసే కొన్ని జిడ్డు పదార్థాలు మరియు బ్యాక్టీరియా ద్వారా వెలువడే కొన్ని రసాయనాలు వర్షపు చినుకులతో ప్రతిస్పందించి, ఘాటైన సువాసనను ఉత్పత్తి చేస్తాయి.

మరొక నివేదిక ప్రకారం మట్టిలో కనిపించే బ్యాక్టీరియా ఆక్టినోమైసెట్స్ లేదా స్ట్రెప్టోమైసెట్స్ కూడా ఈ వాసనకు కారణమవుతాయి.వివిధ మొక్కలు విడుదల చేసే నూనెలు వాతావరణంలో పేరుకుపోతాయి.

కొన్ని రసాయనాలు వర్షం పడిన వెంటనే ఈ నూనెను గాలిలోకి విడుదల చేస్తాయి.ఇదే మ‌ట్టి సువాసనకు కారణం అవుతాయి.

Why Does Soil Smell After Rain People Like Plants Action, Soil Smell , After Rain , Plants , Aerosols, Petrichor - Telugu Aerosols, Petrichor, Small, Soil Smell, Streptomycetes

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube