పరశరాముడు తల్లి రేణుకా ఎల్లమ్మని, సోదరులను ఎందుకు చంపేస్తాడు?

రేణుకా ఎల్లమ్మ తల్లి భర్త జమదగ్ని మహర్షి అని మనందరికీ తెలుసు.వారి పెద్ద కొడుకు పరశురాముడనే విషయం కూడా మనందరికీ విదితమే.

 Why Does Parasharama Kill His Mother Renuka Ellammani And Brothers, Renuka Ellam-TeluguStop.com

కానీ పరశరాముడే ఎల్లమ్మ తల్లిని చంపాడు.ఈ విషయం కూడా అందరికీ తెలిసినప్పటికీ ఎందకలా చేశాడో మాత్రం చాలా మందికి తెలియదు.

కేవలం తల్లినే కాదండోయ్.వారి సోదరులను కూడా చంపాడు.

అందుకు కారణం ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

రేణుకా దేవి జమదగ్ని మహర్షిలకు మొత్తం నలుగురు కుమారులు.

ఒక కూతురు.అయితే ఓ రోజు ఉదయం ఆమె నీటి కొరకు చెరువుకు వెళ్తుంది.

అక్కడ గంధర్వుల జలకేశి చూస్తూ.ఉండిపోతుంది.ఇంటికి తిరిగి వచ్చే సరికి చాలా ఆలస్యం అవుతుంది.కోపించిన జమదగ్ని ఆమెను సంరించవలెనని కుమారులను ఆదేశిస్తాడు.కానీ అందుకు వారు ఒప్పుకోకపోవడంతో పెద్ద కొడుకైన పరశ రాముడిని ఆగ్నాపిస్తాడు.తన మాట విననందుకు మిగతా సోదరులతో పాటు తల్లిని చంపమని చెప్తాడు.అందుకు ఒప్పుకున్న పరశ రాముడు వారందరినీ నరికేస్తాడు.

తన మాట విని భార్య, కొడుకులను చంపినందుకు జమదగ్ని సంతోషించి నీకేం కావాలో కోరుకోమని పరశరాముడికి చెప్తాడు.వెంటనే పరశురాముడు తన తల్లి రేణుకా దేవిని, సోదరులను తిరిగి బ్రతికించమని కోరుతాడు.తన మాట విన్న కుమారుడి కోరికను తీర్చడమే తన కర్తవ్యమని తిరిగి మళ్లీ వారిని జగదగ్ని మహర్షి బతికిస్తాడు.

ఇలా పరశ రాముడు తల్లితో పాటు సోదరులను చంపి మరలా రక్షించుకుంటాడు.

Why Does Parasharama Kill His Mother Renuka Ellammani And Brothers, Renuka Ellamma, Parasharama , Jamadagni Maharshi, Devotional - Telugu Devotional, Ellamma Thalli, Jamadgni Muni, Parusha Ramudu

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube