జపమాలలో 108 పూసలే ఎందుకు ఉంటాయో తెలుసా?  

  • హిందూ సంప్రదాయం ప్రకారం పూజలు చేసే సమయంలో మరియు మంత్రాలను చదివే సమయంలో జప మాలను ఉపయోగిస్తూ ఉంటాం. అయితే జప మాలలో 108 పూసలే ఎందుకు ఉంటాయో మీకు తెలుసా? ఈ విధంగా జప మాలలో 108 పూసలే ఉండటానికి ఆసక్తికరమైన పురాణ గాధలు ఉన్నాయి.

  • ఒక వ్యక్తి రోజులో అంటే 24 గంటల్లో దాదాపుగా 21600 సార్లు శ్వాస తీసుకుంటాడు. ఈ లెక్కన 12 గంటల్లో 10800 సార్లు శ్వాస తీసుకుంటాడు. ఈ లెక్క ప్రకారం 10800 సార్లు జపం చేయటం కష్టం కాబట్టి చివరి రెండు సున్నాలు తీసేసి 108 సార్లు జపం చేయాలని నిర్ధారించారు.

  • ఒక వ్యక్తి జాతకం 12 రాశులు, 9 గ్రహాలతో ముడిపడి ఉన్న సంగతి మనకు తెలిసిందే. రాశుల సంఖ్యను గ్రహాల సంఖ్యతో గుణిస్తే 108 వస్తుంది. అందుకే జపమాలను 108 పూసలతో నిర్ధారణ చేసారు.

  • జ్యోతిష్య శాస్త్రంలో 27 నక్షత్రాలు ,ఒక్కో నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి. 27 నక్షత్రాలను నాలుగు పాదాలతో గుణిస్తే 108 వస్తుంది. అంటే జప మాలలో ఒక్కో పూస ఒక్కో పాదానికి ప్రాధాన్యత వహిస్తుందని అర్ధం. అందువలన హిందూ ధ‌ర్మశాస్త్రం ప్రకారం 108 సార్లు ఏదైనా స్తోత్రాన్ని చదివితే మంచి జరుగుతుందని నమ్మకం.