సాధారణంగా మనం కొత్త వాహనాలను తెచ్చినప్పుడు వాటికి పూజా కార్యక్రమాలను నిర్వహించి చక్రాల కింద నిమ్మకాయలను పెట్టి, వాహనాన్ని నడపడం మనం చూస్తూ ఉంటాం.అంతే కాకుండా ఏదైనా శుభకార్యాలప్పుడు కూడా కార్యానికి బయలుదేరేముందు వాహనం కింద నిమ్మకాయలను పెట్టి తొక్కిస్తారు.
ఇలాంటి పద్ధతులను పాటించడం పూర్వకాలం నుంచి అనాదిగా వస్తోంది.కానీ ఇలా ఎందుకు చేస్తారు అన్న ఆలోచన మాత్రం బహుశా ఎవరికీ కలగకపోవచ్చు? అయితే ఇలా వాహనాల కింద నిమ్మకాయలను ఎందుకు పెడతారు? అలా నిమ్మకాయలను తొక్కించడం వెనక గల కారణాలు ఏమిటి? ఇక్కడ తెలుసుకుందాం…
కొత్త వాహనాలను కొన్నప్పుడు, లేదా ఏదైనా శుభకార్యాలకు వెళ్ళినప్పుడు మనం బండి చక్రాల కింద నిమ్మకాయలను పెట్టి వాటిని ఆ వాహనంతో తొక్కించి బయలుదేరుతారు.అలాగే టెంకాయను కూడా కొడతారు.ఇక్కడ నిమ్మకాయ, టెంకాయలను మనిషి తలగా భావించి నిమ్మకాయను తొక్కించడం ద్వారా మనుషులకు జరిగే ప్రమాదాలను తప్పించటానికి మనం ముందుగా వాటి కింద నిమ్మకాయలను పెట్టి, టెంకాయలు కొట్టడం వల్ల అంతటితో దోషం తొలగిపోతుందని భావించి ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు.
సైన్స్ ప్రకారం పూర్వం ఎడ్లబండ్లు మాత్రమే ఉండేవి.వాటిని లాగడానికి పశువులను ఉపయోగించేవారు.
ఆ పశువులు రాళ్లు , రప్పలు, బురద ప్రాంతాలలో తిరగటం వల్ల కాళ్ళకు ఏదైనా తగిలి ఇన్ఫెక్షన్ల బారిన పడతాయి.ఇలా ఇన్ఫెక్షన్ కావడం వల్ల వాటికి నడవడానికి ఇబ్బందిగా ఉంటుంది.
అందువల్ల బండి కింద నిమ్మకాయలు తొక్కించి వెళ్లండి అని మన పెద్దలు చెబుతుంటారు.అలా చేయటం ద్వారా, అందులో ఉన్న సిట్రస్ యాసిడ్ పుండులో ఉన్న బ్యాక్టీరియాని చంపడం ద్వారా తొందరగా గాయం మానిపోతుంది.
అందువల్ల పూర్వకాలంలో ఎడ్ల బండి కింద, గుర్రపు బండి కింద నిమ్మకాయలను పెట్టేవారు.ఆచారమే ఇప్పుడు ఉపయోగించే వాహనాల కింద పెట్టి పాటిస్తున్నారు.