రావి చెట్టు, వేప చెట్టుకు ప్రదక్షిణలు ఎందుకు చేయాలి?  

  • వేప చెట్టు లక్ష్మీ స్వరూపం, రావి చెట్టు విష్ణు స్వరూపంగా భావించి పూజలు చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. రావి చెట్టు నుండి వచ్చే గాలిలో ఉండే ఆమ్ల జనితంను పీల్చడం ద్వారా రక్తపోటు కంట్రోల్ అవ్వడం మరియు స్త్రీలకు గర్బస్థ సమస్యలు తగ్గుతాయని ఆధునిక సైన్స్ కూడా నిరూపణ చేసిన విషయం మనకు తెలిసిందే.

  • జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసినా శని గ్రహ దోషం ఉన్నవారు ఈ చెట్టు చుట్టూ తిరగడం వలన కూడా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పడం చేత మరియు ఆయుర్వేదం ప్రకారం కూడా వేప చెట్టులో అనేక మంచి గుణాలు ఉన్నాయి. పెద్దలు శాస్త్ర ప్రకారం దైవం గా భావించి సైన్స్ ప్రకారం కూడా అలోచించి ప్రదక్షిణలు నియమం పెట్టారు .అందుకే పెద్దలు చెప్పిన మాటను పెడచెవిన పెట్టకుండా వినాలి.