ఫోన్ ఎత్తగానే హలో అని ఎందుకంటారో మీకు తెలుసా...?

చరవాణి. 20వ శతాబ్దంలో చరవాణి ఉపయోగించని వారు ఉండరు.

 Why Do We Say Hello To Answer Phone-TeluguStop.com

అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ చరవాణి రోజు రోజుకి అభివృద్ధి చెందుతోంది.దీనికితోడు టెక్నాలజీ కూడా బాగా అభివృద్ధి చెందటంతో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వందల కోట్ల మంది స్మార్ట్ ఫోన్లను ఉపయోగిస్తున్నారు.

అయితే ఇప్పుడంటే సెల్ ఫోన్లు అందరికీ అందుబాటులోకి రావడంతో వీటిని ఉపయోగించడం చాలా సులభం అయింది.కానీ అప్పట్లో మాత్రం ల్యాండ్ లైన్ కనెక్షన్ ఫోన్లు ఉండేవి.

 Why Do We Say Hello To Answer Phone-ఫోన్ ఎత్తగానే హలో అని ఎందుకంటారో మీకు తెలుసా…-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ ఈ ల్యాండ్ లైన్ ఫోన్లు కేవలం ఒక ఇంటికి మాత్రమే పరిమితం అయ్యాయి.దాంతో ప్రతి ఒక్కరికి ఫోన్ ని అందుబాటులోకి తీసుకురావడం కోసం టెలీ ఫోన్ బూత్ లు, అలాగే కాయిన్ బాక్స్ ఫోన్లను అందుబాటులోకి తెచ్చారు.

కాగా క్రమక్రమంగా సెల్ ఫోన్లను వాడటంలో ప్రజలకి అవగాహన పెరగడంతో ప్రస్తుత కాలంలో కాయిన్ బాక్సులు, టెలీ ఫోన్ బూత్ లు పెద్దగా కనిపించవు.అయితే స్మార్ట్ ఫోన్ అయినా, ల్యాండ్ లైన్ కనెక్షన్ అయినా లేదా ఇతరత్రా ఫోన్ ఏదైనా సరే ఫోన్ ఎత్తగానే అందరూ “హలో” అని ఎందుకంటారో ఇప్పటికీ చాలా మందికి తెలియదు.

ఈ విషయం గురించి మరిన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం…

అయితే ముందుగా అమెరికాకు చెందిన “అలెగ్జాండర్ గ్రహమ్ బెల్” ఫోన్ ను 1885 సంవత్సరంలో కని పెట్టాడు.అయితే ఇందుకుగాను గ్రహమ్ బెల్ దాదాపుగా పది సంవత్సరాలకు పైగా కష్ట పడినట్లు చరిత్ర చెబుతోంది.

ఈ క్రమంలో ఎన్నో సార్లు ఫెయిల్ అయ్యాడు.అయినప్పటికీ పట్టు విడవకుండా శ్రమించి చివరికి విజయం సాధించాడు.

దాంతో మొదటగా గ్రహమ్ బెల్ తన భార్య హలో మార్గరీట కి ఫోన్ చేశాడు.ఆమె ఫోన్ ఎత్తగానే “హలో” అని పిలిచాడు.

దాంతో అప్పటి నుంచి “హలో” అనే పదాన్ని ఫోన్ ఎత్తిన సమయంలో ఉపయోగిస్తున్నట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి.అయితే 18వ శతాబ్దంలో ఈ ఫోన్ వాడకం పై ప్రజలకి పెద్దగా అవగాహన లేకపోయినప్పటికీ 20వ శతాబ్దంలో మాత్రం ప్రపంచంలోని ప్రతి 100 మందిలో దాదాపుగా 80 మందికి పైగా సెల్ ఫోన్లను ఉపయోగిస్తున్నారు.

అయితే ఈ సెల్ ఫోన్ ని కేవలం మాట్లాడడం కోసం మాత్రమే కాకుండా ఇంటర్నెట్ సేవలను కూడా వినియోగిస్తున్నారు.అయితే ఈ ఇంటర్నెట్ సేవల్లో భాగంగా కొందరు గూగుల్ ద్వారా ఎన్నో విషయాలను తెలుసుకోగలుగుతున్నారు.అంతేకాకుండా నగదు లావాదేవీలు మరియు మ్యాప్ నావిగేషన్ వంటి వాటిని ఉపయోగిస్తూ కష్టతరమైన పనులను కూడా సుసాధ్యం చేస్తున్నారు.కాగా ప్రస్తుతం 4జి సేవలు అందుబాటులో ఉన్నాయి.

కానీ ఇటీవలే పలు సంస్థలు 5జి సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.దీంతో ఇప్పటికే పలు మొబైల్ కంపెనీ సంస్థలు 5జి నెట్ వర్క్ మొబైల్స్ ని కూడా రూపొందిస్తున్నాయి.

#WhyDo #Hello #America #Mobile Networks #Hello Margarita

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు