ఆలయంలోనికి ప్రవేశించే ముందు గడపకెందుకు నమస్కరిస్తారు?

సాధారణంగా దేవాలయాలలో ప్రధాన ద్వారం వద్ద, గర్భగుడిలోకి వెళ్లే ముందు ఉన్న గడపలు రాయితో తయారు చేస్తారు.ఈ గడపకు ప్రతి భక్తుడూ నమస్కరిస్తుంటాడు.

 Why Do We Bow At Temple Entrance Before Entering-TeluguStop.com

ఇలా ఎందుకు నమస్కరిస్తారనే విషయం చాలా మంది భక్తులకు తెలియదు.వాస్తవానికి గృహాలకు చెక్కతో తయారు చేసిన గడప ఉంటుంది.

అలాగే, ఆలయాలకు అయితే రాయితో తయారు చేసిన గడప ఉంటుంది.

ఆ ఆలయ గడపకు ఎందుకు నమస్కరించాలి అనే అంశాలను పరిశీలిస్తే రాయి పర్వతానికి చెందినది.

భద్రుడు అనే ఋషి భద్రమనే పర్వతంగానూ, హిమవంతుడు అనే భక్తుడు హిమాలయముగానూ, నారాయణుడు అనే భక్తుడు నారాయణాద్రిగానూ అవతరించారని పురాణాలు చెపుతున్నాయి.ఆ భక్తుల కోసం భగవంతుడు కూడా ఆ కొండలమీదే వెలిశాడు.

అందుకే ఆ కొండ రాళ్ళ నుంచి వచ్చిన రాయినే మలిచి ఆలయ గర్భగుడులకు గడపగా పెట్టారని శాస్త్రాలు చెపుతున్నాయి.

అయితే, ఆ గడప నిత్యం దైవాన్ని దర్శిస్తూ ఉంటుంది.

అలా ఆ గడప రాయి పుణ్యం చేసుకుంది.అందుకే ఆ గడప రాయి చేసుకున్న పుణ్యానికి నమస్కరిస్తూ, కొండ రాయిగా మారిన భక్తుడిని దాటుతున్నందుకు క్షమించమని, మన్నించమని వేడుకోవడమే గడపకు నమస్కరిస్తారని పురాణాలు చెపుతున్నాయి.

అందుకే ఆలయాల్లో ప్రధాన గడప తొక్కకుండా కేవలం దాటాలని ఆధ్యాత్మికవేత్తలు సూచిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube