అంత్యక్రియల్లో కుండను ఎందుకు పగలగొడతారో తెలుసా..?

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం చేసే ప్రతి పని వెనుక ఒక అర్థం, పరమార్థం ఉంటుందని పూర్వీకులు చెబుతుంటారు.మన ఇళ్లలో ఎవరైనా చనిపోతే వారి శరీరం చితి మీద పెట్టి, కుండలో నీటిని తీసుకొని వారి చుట్టూ మూడు సార్లు తిరిగి పగలగొడతారు.

 Why Do Put Holes To Pot, Hindu Final Rituals, Hindu Sampradayam, Cremation, Fina-TeluguStop.com

ఇలా ఎందుకు చేస్తారో తెలుసా? దీని వెనుక కూడా ఒక అర్థం ఉంది.అది ఎందుకు అనేది మనం ఇప్పుడు చదివి తెలుసుకుందాం.

వాస్తవానికి శరీరం, ఆత్మ రెండు వేరు వేరు.పూర్వకాలంలోని ప్రజలు మంచి పౌష్టికాహారం తీసుకోవడం వల్ల దాదాపుగా 100 సంవత్సరాలు పైబడి బ్రతికేవారు.కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా జీవిత కాల పరిమితి కూడా తగ్గుతూ వస్తుంది.మనం చనిపోయినప్పుడు మన శరీరం నుండి ఆత్మ వేరవుతుంది.

శరీరాన్ని దహనం చేసేదాకా, తిరిగి ఆత్మ శరీరంలోకి రావాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది.పాడె కట్టిన ఆ శరీరాన్ని ఎత్తుకెళ్లేటప్పుడ రాగులు బొరుగులు లాంటివి చల్లుతూ వెళ్తారు.

ఇలా చల్లడానికి గల కారణం శరీరాన్ని కాల్చిన తర్వాత కూడా తన వారి మీద ఇష్టంతో ఆత్మ ఇంటికి రావాలంటే తన శరీరం మీద చల్లిన రాగులను, బొరుగుల ను ఏరుకొని రావాల్సి ఉంటుంది.అది కూడా సూర్యోదయం అయ్యే లోపు.

అలా చేసినప్పుడు మాత్రమే తన వారిని చూడటానికి అనుమతి దొరుకుతుందని మన సాంప్రదాయాలు చెబుతున్నాయి.

అంత్యక్రియలు అప్పుడు శరీరాన్ని పాడే మీద పడుకోబెట్టి, ఒక కుండలో నీటిని తీసుకుని దానికి రంధ్రాలు చేసి శరీరం చుట్టూ మూడు సార్లు తిరుగుతారు.

ఎందుకంటే కుండ శరీరం లాంటిది… అందులోని నీరు ఆత్మ లాంటిది.కుండ నుంచి నీరు ఎలాగైతే బయటికి వెళ్తుందో.

అలాగే నీ శరీరం నుంచి ఆత్మను బయటికి వెళ్ళిపో అని దాని వెనక అర్థం.కుండను కింద పడేసి పగలగొట్టి.

శరీరానికి నిప్పు పెట్టేస్తాం.ఇంకా నీకు ఈ శరీరం ఉండదు.

నువ్వు వెళ్ళిపో అని ఆత్మకు మనమిచ్చే సంకేతం.మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం చేసే ప్రతి పని వెనుక కూడా అర్థం దాగి ఉంది.

దీనిని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Why Do Put Holes To Pot, Hindu Final Rituals, Hindu Sampradayam, Cremation, Final Rituals - Telugu Final Rituals, Hindufinal, Put Holes Pot

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube