సంక్రాంతి పండుగలకు వేసే ముగ్గులకు చాలా విశిష్టత ఉంది.ఈ పండుగ సంబురాల్లో వేసే రంగవళ్లుల్లో ఖగోళంలో జరిగే గ్రహ గోళాల విన్యాసాలు ఉంటాయనే విషయం చాలా మందికి తెలియదు.
కానీ నిజానికి మనం పండుగ రోజుల్లో వేసే ముగ్గుల్లో పౌరాణిక గాథలు, చారిత్రక అంశాలే ఉంటాయి.ఉదాహరణకి వైకుంఠ ఏకాదశికి స్వర్గ ద్వారాలు తెరుచుకున్నట్లు, అంతకు ముందు రోజు మూసి ఉన్నట్లుగా ముగ్గులు వేస్తారు.
సంక్రమణం రోజు రథం ఇంట్లోకి వస్తున్నట్లుగా కనుమ నాడు బయటకు వెళ్తున్నట్లుగా ముగ్గు వేస్తారు.
ఈ రథం ముగ్గును సూర్య భగవానుడి రథంగా భావిస్తారు.
అంతే కాదండోయ్ మన ఇంటి ముందు వేసే రథం ముగ్గుకు ఒక గీతను గీసి పక్కింటి ముగ్గుతో కలుపుతాం.వారు ఆ పక్కింటి వారి రథం ముగ్గుకు కలుపుతారు.
ఇలా అందరూ తమ ముగ్గులను వేరే వారి ముగ్గులతో కలుపుకుంటూ వెళ్తారు.ఇలా చేయడం వల్ల ఆ సూర్య భగవానుడి గ్రామంలోని వాడ వాడ తిరిగుతాడని ప్రజల నమ్మకం.
సూర్యుడు అలా తిరగడం వల్ల ఆ సూర్య కిరణాలు తమ ఇంటిపై పడి తమకు అంతా మంచే జరుగుతుందని భావిస్తారు.
అందుకే ఈ రోజు సూర్య దేవుడిని ప్రార్థిస్తే… ఆరోగ్యంతో పాటు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రజల నమ్మకం.
అందుకే ఇంటి ముందు రథం ముగ్గులు వేసి ఆ దేవుడిని గుర్తు చేసుకుంటారు.సంక్రాంతి పండుగలో అంటే ముగ్గులకు ఇదే చివరి రోజు.
ఆ తర్వాత రోజు నుంచి వేసేవన్ని సాధారణ ముగ్గులే.