హిమాలయాల పైనుంచి విమానాలు ఎందుకు ఎగరవు? ఆ అందాలను పైనుంచి చూడలేమా?

హిమాలయాలు మన దేశానికి కిరీటంలాంటివని చిన్నప్పటి నుంచి వింటున్నాం.సినిమాలు, టీవీ, సోషల్ మీడియాలో హిమాలయాల అందాలను చూస్తుంటాం.

 Why Do Planes Not Fly Over The Himalayas Details, Aeroplanes, Himalayas, Himalay-TeluguStop.com

అయితే హిమాలయాల మీదుగా విమానాలు ఎగురవని మీకు తెలుసా? నిజానికి హిమాలయాల మీదుగా విమానాల ప్రయాణ మార్గం ఉండదు.హిమాలయాలలో వాతావరణం నిరంతరం మారుతూ ఉంటుంది.

ఇది విమానాల ప్రయాణానికి అనువైనది కాదు.

మార్పులతో కూడిన వాతావరణం విమానాలకు అత్యంత ప్రమాదకరం.

హిమాలయాల ఎత్తు 23 వేల అడుగులు. సగటున, విమానాలు 30 నుంచి 35 వేల అడుగుల ఎత్తు వరకు ఎగురుతాయి.

అయినా హిమాలయాల ఎత్తు విమానాలకు ప్రమాదకరం.విమానంలో ఎమర్జెన్సీ కోసం 20 నుంచి 25 నిమిషాలకు సరిపడే ఆక్సిజన్ ఉంటుంది, అత్యవసర పరిస్థితుల్లో విమానం 8 వేల నుంచి 10 వేల అడుగుల ఎత్తులో ఎగరాల్సి వుంటుంది.

తద్వారా విమాన ప్రయాణీకులకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవవు.

Telugu Emergency, Himalaya, Himalayas, Oxygen, Change-Latest News - Telugu

హిమాలయ ప్రాంతాలకు సంబంధించిన మరో సమస్య కూడా ఉంది.అక్కడ సరైన నావిగేషన్ సౌకర్యం లేదు.అటువంటి పరిస్థితిలో అత్యవసర పరిస్థితుల్లో విమానం ఎయిర్ కంట్రోల్‌ను సంప్రదించలేదు.

అంతే కాకుండా అత్యవసర ల్యాండింగ్ కోసం హిమాలయాల సమీపంలో ఎటువంటి విమానాశ్రయం లేదు.హిమాలయాల మీదుగా విమానాలు ఎందుకు వెళ్లవో ఈపాలిటికే మీకు అర్థమై ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube