నిద్ర మధ్యలో మూత్రం ఎందుకు వస్తుంది?

నిద్ర ఉన్నది శరీరానికి విశ్రాంతినివ్వడం కోసం.నిద్ర సుఖవంతంగా, అడ్డంకులు లేకుండా ఉండాలి.

 Why Do People Wake Up And Pee In Midnight?-TeluguStop.com

ఒక్కసారి నిద్రలోకి జారుకున్నామంటే మళ్ళీ 7-8 గంటల దాకా పడుకున్న శవం లాగా అలాగే పడుండాలి.అదే సుఖమైన నిద్ర.

ప్రశాంతమైన నిద్ర.మూత్ర విసర్జన చేయడానికి లేవడం నిద్రకి పెద్ద ఆంటకం.

దీన్ని నొక్టోరియా అని అంటారు.అసలు అర్థరాత్రి అంత మూత్రం ఎందుకు వస్తుంది.

నిద్రమధ్యలో ఈ అడ్డంకేంటి ? దాని వెనుక కారణాలేంటి?

* స్లీప్ అప్నియాతో ఇబ్బందిపడేవారికి ఇలా నిద్రమధ్యలో మూత్రం వస్తుంది.శరీరంలో ఆర్టియల్ నాట్రియూరేటిక్ పెప్టైడ్ విడుదలై, మూత్రాన్ని ఎక్కువ విడుదల చేస్తుంది.

* నిలుచోని ఉన్నప్పుడు గ్రావిటి వలన కాళ్ళలోనే ఉండిపోయిన ఫ్లూడ్స్ ని గుండె సరిగా పంప్ చేయలేదు.అవి పడుకోగానే బ్లడ్ స్ట్రీమ్ లోకి వెళ్లిపోయి మూత్రాన్ని ఉత్పత్తి చేస్తాయి.

* డయాబెటిస్ తో బాధపడే వారికి మూత్రం అనేది నిత్యసమస్య.కిడ్నీల్లో గ్లూకోజు శాతం పెరిగిపోవడంతో మూత్రం అధికంగా వస్తుంది.

* వయసు పెరిగినా కొద్ది, బ్లడర్ కెపాసిటి తగ్గిపోతూ ఉంటుంది.అందుకే వయసు పెరిగినా కొద్ది నిద్ర మధ్యలో మూత్రం వచ్చే అవకాశం పెరిగిపోతుంది.

* రాత్రిపూట మద్యం కాని, కాఫీ కాని తాగితే, నిద్రకు అడ్డంకులు తప్పవు.ఆల్కహాల్, కెఫైన్ .రెండూ అధిక మూత్రానికి కారణమవుతాయి.

* పొట్టలో కొవ్వు ఎక్కువున్నా, ఆ కొవ్వు నొక్టిరియాకి కారణమవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube