కనుమ పండుగ రోజు ప్రయాణం ఎందుకు చెయ్యకూడదు?

సూర్యుడు దక్షిణాయణం నుంచి ఉత్తరాయణం లోనికి ప్రవేశించేటప్పుడు సంక్రాంతి పండుగను జరుపుకుంటారు.సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించినప్పుడు భూమి తిరిగే దిశ కూడా మారుతుంది.

 Why Do Not Travel On Kanuma Festival-TeluguStop.com

ఈ సందర్భంలోనే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన సమయంలో మకర సంక్రాంతిని జరుపుకుంటారు.మూడు రోజులపాటు జరుపుకునే ఈ పండుగ దేశ వ్యాప్తంగా వివిధ రకాల పేర్లతో జరుపుకోవడం విశేషం.

మొదటి రోజు భోగి, మరి నాడు మకర సంక్రాంతి, చివరిగా కనుమ పండుగను జరుపుకుంటారు.అయితే మన పెద్దవారు కనుమ పండుగ రోజు ఎవరు కూడా ప్రయాణాలు చేయకూడదని చెబుతుంటారు.

 Why Do Not Travel On Kanuma Festival-కనుమ పండుగ రోజు ప్రయాణం ఎందుకు చెయ్యకూడదు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అలా ఎందుకు చేయకూడదో ఇక్కడ తెలుసుకుందాం.

మూడు రోజుల పాటు నిర్వహించే సంక్రాంతి పండుగలో మొదటి రెండు రోజులు ఎంతో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి పండుగను జరుపుకుంటారు.

చివరి రోజయిన కనుమ పండుగను వివిధ రకాల మాంసాహార లను చేసుకొని తింటారు.ఈ కనుమ రోజు మాంసం తినని వారికి మాంసంలో లభించే పోషకాలతో సమానమైన పదార్థాలను వండుతారు.

అందుకోసమే కనుమ నాడు మినుము తినాలనేది సామెతగా వాడుతుంటారు.

సంక్రాంతి పండుగ రోజు కుటుంబ సభ్యులతో పాటు కూతుళ్ళు, అల్లుళ్ళు ఇంటికి రావడంతో అందరు కలిసి భోజనం చేయడం ఆనవాయితీ ఈ కనుమ రోజు పితృదేవతలకు ప్రసాదాన్ని పెట్టి కుటుంబ సభ్యులు అందరూ కలిసి భోజనం చేస్తారు.

అదే విధంగా అందరూ కలిసి కాసేపు సరదాగా కూర్చొని మాట్లాడటం కోసం కనుమ రోజు ఎక్కడికి ప్రయాణాలు చేయకుండా, కేవలం కుటుంబ సభ్యులతో గడపాలని చెబుతుంటారు.అంతేకాకుండా కనుమ రోజు కాకి కూడ కదలదని సామెతను మన పెద్దలు కూడా చెబుతుంటారు.

అత్యవసరమైతే తప్ప ఈ పండుగ రోజు ప్రయాణాలు చేయకూడదు.ఒకవేళ పెద్దల మాట కాదని ప్రయాణం చేసిన వారి ప్రయాణంలో ఆటంకాలు ఏర్పడుతాయని పెద్దలు చెబుతుంటారు.

#Kanuma #Hindu Rituals #Hindu Believes

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

DEVOTIONAL