ఇంటి లోపల గోళ్ళను ఎందుకు కత్తిరించకూడదు...ఎందుకో తెలుసా?

మన శరీరంలో అన్ని భాగాల కన్నా గోళ్ళు చాలా పదునుగా ఉంటాయి.వేళ్ళ చివర ఉండడం వల్ల మనం తాకిన వస్తువుల తాలూకు సూక్ష్మ జీవులు,నడచిన నేల మీది దుమ్ము,ధూళి వంటివి గోళ్ళలోకి చేరతాయి.

 Why Do Hindus Say That We Should Not Cut Our Nails Inside The Home-TeluguStop.com

కాబట్టి గోళ్ళు విషపూరితమైనవిగా మారతాయి.గోళ్ళు ఇంట్లో తీయడం వల్ల పొరపాటున అవి చర్మానికి గుచ్చుకుంటే వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది.

తినే పదార్థాలలో గోళ్లు పడితే అరిగించుకునే శక్తి మన జీర్ణవ్యవస్థకి లేని కారణంగా ప్రేగులు దెబ్బతినే అవకాశం ఉంటుంది.ఇంట్లో గోళ్ళు కత్తిరించడం దరిద్ర దేవతకు ఆహ్వానం పలకడమే అవుతుంది.

గోళ్ళు మన జన్యు స్వరూపాన్ని తెలుపుతాయి.అందుకే చేతబడి చేసే వారు ఎవరికైతే చెడు చేయాలనుకుంటున్నారో వారి గోళ్ళని, తలవెంట్రుకలనీ సేకరిస్తారు.

ఎప్పుడు ఏ ప్రమాదం పొంచి ఉంటుందో, లేక ఎవరు మనల్ని దెబ్బతీయాలని ఆలోచిస్తున్నారో తెలుసుకోవడం కష్టం.

గోళ్లు కత్తిరించిన తర్వాత గోళ్లను ఎవరికీ తగలని చోట, ఎవరూ తిరగని ప్రదేశాలలో పారవేయాలి.

గోళ్ళు ఇంట్లో కత్తిరించక పోవడం వల్ల ఇల్లు పరిశుభ్రంగా ఉంటుంది.ఎవరికైనా గుచ్చుకుని లేదా ఆహార పదార్థాలలో చేరి దానివల్ల వ్యాధులు వచ్చే ప్రమాదం తప్పుతుంది.

అందువల్ల గోళ్లను ఇంటిలో కత్తిరించకూడదని మన పెద్దలు చెప్పుతూ ఉంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube